Kubera Movie : శేఖర్ కమ్ముల ‘కుబేర’ స్టోరీపై ఓ కీలక అప్డేట్

అయితే ఈ సినిమా శేఖర్ కమ్ముల చిత్రాలకి పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది...

Kubera : ధనుష్‌, నాగార్జున కీలక పాత్రధారులుగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కుబేర(Kubera)’. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో సునీల్‌ నారంగ్‌, పుస్కుర్‌ రామ్‌ మోహన్‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా శేఖర్ కమ్ముల చిత్రాలకి పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Kubera Movie Updates

శేఖర్కమ్ముల తన ఫీల్ గుడ్ సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నారు. అయితే ‘కుబేర’ సినిమా మాత్రం పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదొక పక్కా యూత్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇందుకు తగ్గట్లుగానే యాక్షన్ ఎపిసోడ్లు, ఛేజింగ్‌లు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఛేజింగ్ సీన్లను షూట్ చేస్తున్నారు. టిపికల్ శేఖర్ కమ్ముల సినిమాల కాకుండా ఇది డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్ ల ప్రకారం ధనుష్ ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తున్నారు. మరి ఈ కథ ఎంత వరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అందరు ఉత్కంఠతో ఎదురు చూస్తునారు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ ని పరిశీలిస్తే.. నాగార్జున కూల్, కాన్ఫిడెంట్, వెల్త్ తో కనిపించారు.ధనుష్ పేదరికంలో బలమైన చూపుతో కనిపించారు.మురికివాడల్లో ఆడుకుంటున్న పిల్లల మధ్య రష్మిక కఠినమైన వాస్తవాలను రిఫ్లెక్ట్ చేస్తూ కనిపించారు.

Also Read : Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా నుంచి మరో కీలక అప్డేట్

CinemaKuberaTrendingUpdatesViral
Comments (0)
Add Comment