Pushpa 2 Collections : అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమా వసూళ్లపై కీలక అప్డేట్

Pushpa 2 : ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప: ది రూల్‌(Pushpa 2)’ చిత్రం ఈ నెల 5న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 11500 థియేటర్స్‌లో విడుదలైంది. అయితే అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందు విడుదల, దాని కంటే ఒక రోజు ముందు ప్రీమియర్‌ షోలు పడ్డాయి. అంటే ఈ నెల 5న సినిమా విడుదల అయితే 4వ తేది రాత్రి 9.30 గంటల నుండే షోలు మొదలయ్యాయి. విడుదలకు ముందు ఎంత హైప్‌ వచ్చిందో తెలిసిందే.. క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినిమా సక్సెస్‌కు ఆకాశమే హద్దు అన్నట్లుగా చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది. విడుదల రోజు టాక్‌ కూడా అలాగే ఉంది. రెండు షోలు పూర్తయ్యేసరికి సినిమాపై విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది.

అయితే దానికి కారణం సినిమాలో కొన్ని సీన్లు కావచ్చు. ఫస్ట్‌ డే నిర్మాణ సంస్థ ప్రకటించిన కలెక్షన్లు కావచ్చు. తాజాగా ‘పుష్ప 2(Pushpa 2)’ మేకర్స్‌ డే 1 కలెక్షన్స్‌ అంటూ మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టినట్లుగా చెబుతూ.. ‘ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే హయ్యస్ట్‌ కలెక్షన్స్‌’ రాబట్టిన చిత్రంగా పోస్టర్‌ విడుదల చేశారు. డిసెంబర్‌ 4, 5వ తేదీలు కలిపి ఒక్క రోజు ఎలా అవుతుంది? డిసెంబర్‌ 4న ప్రదర్శితమైన షోల కలెక్షన్స్‌ కూడా కలిపి ‘డే 1 ఆల్‌ టైమ్‌ రికార్డ్‌’ అని ఎలా ప్రకటిస్తారు? ఇవి ఒకరోజు లెక్కలా? రెండు రోజుల లెక్కలా? అనేది ఇప్పుడు ప్రశ్న.

Pushpa 2 Collections Update

అయితే తాజాగా కృష్ణజిల్లాకు సంబంధించిన కలెక్షన్ల గురించి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ చిత్రం మొదటి షో షేర్‌ రూ.4.42 కోట్లు వసూళ్లు రాబట్టి కృష్ణా జిల్లా కలెక్షన్ల రికార్ట్‌లో ఆల్‌టైమ్‌ రికార్డ్‌గా నిలిచింది. అయితే అదే రెండో షేర్‌ చూస్తే రూ.77 లక్షలకు పడిపోయింది. మొత్తం మీద రెండు రోజుల్లో కృష్ణా జిల్లా షేర్‌ కేవలం రూ. 5.19 కోట్లు మాత్రమే. కృష్ణాలో పెద్ద సినిమాల కలెక్షన్లతో ఇదొక ఘోర పరాజయంగా ట్రేడ్‌ పండితులు చెబుతున్నాయి. అయితే నిర్మాణ సంస్థ మాత్రం లెక్కకు మించి కలెక్షన్ల గురించి ప్రకటనలు చేస్తోంది.

అయితే మూడో రోజుకి సినిమా మరింత డౌన్‌ ఫాల్‌ అయింది. అది ఆన్‌లైన్‌ బుకింగ్‌ చూస్తే అర్థమవుతుంది. నైజాంలో సింగిల్‌ స్ర్కీన్‌, మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ ఏదైనా 50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేదు. గో గ్రిన్‌ అన్నట్లుగా మొత్తం గ్రీనే చూపిస్తున్నాయి. ఇప్పుడు హిందీ బెల్ట్‌లో రూ. 72 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. నైజాంలో రూ. 30 కోట్లతో సరికొత్త రికార్డ్‌ అని చెప్పేశారు. అంటే నైజాం, హిందీ బెల్ట్‌ కలిపితే ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టినట్లు.

ఏపీ(AP), కేరళ, కర్ణాటక, తమిళనాడు, రెస్టాఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ కలిపి సుమారు రూ. 194 కోట్లు వచ్చినట్లు. ఓవర్సీస్‌ పరంగా ప్రీ ేసల్స్‌ లోనే ఈ సినిమా రూ. 100 కోట్లు వచ్చినట్లుగా మేకర్స్‌ ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే ఇంతకు ముందు ఓ నిర్మాత చెప్పినట్లుగా పబ్లిసిటీ కోసమే ఇలా పోస్టర్‌ రిలీజ్‌ చేసినట్లుగా అర్థమవుతుంది. ఈ పోస్టర్‌ చూసిన వారంతా.. పబ్లిసిటీ లెక్కలు మాకొద్దు.. ఒరిజినల్‌ కలెక్షన్స్‌ చెప్పండి అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తుండటం విశేషం. ప్రస్తుతం పుష్ప-2 కలెక్షన్ల గురించి నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.

Also Read : Shobu Yarlagadda : బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ వాట్సాప్ హ్యాక్

CollectionsPushpa 2TrendingUpdatesViral
Comments (0)
Add Comment