NTR : ‘దేవర’ చిత్రం తర్వాత జూ. ఎన్టీఆర్(NTR) ప్రశాంత్ నీల్ కలయికలో ఓ చిత్రం రాబుతోన్నా విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే పేరు పరిశీలనలో ఉందని టాక్ నడుస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్ ని సంక్రాంతికి అఫీషియల్‌గా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో తారక్ నెగటివ్‌రోల్‌లో కనిపిస్తాడని సమాచారం. డ్రాగన్ టైటిల్‌కి తగ్గట్టే ప్రశాంత్ నీల్ పాత్రను డిజైన్ చేశాడని టాక్. యూరోపియన్ కల్చర్‌లో చెడుకి సింబల్ డ్రాగన్. మైథాలజీలో ఓ రాక్షసుడు. డ్రాగన్‌కి అగ్గి పీల్చే గుణం వుంటుంది. అలాగే అలజడికి సింబాలిక్‌గా డ్రాగన్ ని వాడుతారు. ఇవన్నీ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఉండేట్లు డిజైన్ చేస్తున్నారు నీల్.
NTR-Prasanth Neel Movie Updates
‘టెంపర్’ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి ఆ తరహా పాత్రలో మెరవనున్నారు. అయితే నీల్ హీరో ఎప్పుడూ విలన్ టచ్‌లోనే ఉంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఓ విలనీ హీరోయిజం క్యారెక్టర్‌నే ప్లాన్ చేశారు. ఈ సినిమా 295లో సెట్స్‌పైకి వెళ్లనుంది ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్2’ మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తవ్వగానే ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెడతారు.
Also Read : Nayanthara : ధనుష్ దావా పై ఘాటుగా స్పందించిన నయనతార