Vishwambhara Movie : మెగా స్టార్ నటించిన ‘విశ్వంభర’ నుంచి కీలక అప్డేట్

అలాగే అనల్‌ అరసు నేతృత్వంలో క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు...

Vishwambhara : చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. త్రిష కథానాయిక. ఆషికా రంగనాథ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ఇప్పటికే టాక పార్ట్‌ పూర్తైనట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించింది. ఎంఎం.కీరవాణి సారథ్యంలో సంగీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక క్లైమాక్స్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు మూడు పాటల్ని చిత్రీకరించాల్సి ఉంది.

Vishwambhara Movie Updates

దీనికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ ఆగస్టు తొలి వారంలో హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని సినీవర్గాల నుంచి సమాచారం. దీనికోసం ఇప్పటికే ఇక్కడ కొన్ని ప్రత్యేక సెట్లు సిద్థం చేశారట. ఆ సెట్స్‌లోనే చిరు ఇంట్రడక్షన్ సాంగ్‌తోపాటు మిగిలిన సాంగ్స్‌ను తెరకెక్కించనున్నారు. అలాగే అనల్‌ అరసు నేతృత్వంలో క్లైమాక్స్ ఫైట్‌ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరుకు మొత్తం చిత్రీకరణను ముగించాలన్న లక్ష్యంతో చిత్ర యూనిట్‌ పని చేస్తోందట. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది.

Also Read : Hero Suriya : డైరెక్టర్ సుధా కొంగర ప్రాజెక్ట్ ‘సూరరైపోట్రు’ నుంచి తప్పుకున్న సూర్య

ChiranjeeviTrendingUpdatesViralVishwambhara
Comments (0)
Add Comment