Keerthy Suresh : బాలీవుడ్ డెబ్యూ పై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సౌత్‌లో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్‌లోనే కనిపించిన కీర్తి సురేష్ నార్త్‌లో మాత్రం గ్లామర్‌ రోల్‌లో అదరగొట్టారు...

Keerthy Suresh : అయితే బాలీవుడ్ డెబ్యూ విషయంలో కీర్తి సురేష్(Keerthy Suresh) మాత్రం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. నార్త్‌లో తొలి సినిమాను ప్రస్టీజియస్‌గా తీసుకున్న ఈ బ్యూటీ, ఆ సినిమా ప్రమోషన్స్‌లోనూ కీ రోల్‌ ప్లే చేశారు. పెళ్లి తరువాత వారం రోజులు కూడా బ్రేక్ తీసుకోకుండా పసుపు తాడుతోనే ప్రమోషన్స్‌లో కనిపించారు. దీంతో కీర్తి డెడికేషన్‌కు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. పెర్ఫామెన్స్ విషయంలోనూ బాలీవుడ్‌ కోసం తన కంఫర్ట్ జోన్‌ను దాటి నటించారు కీర్తి సురేష్‌.

Keerthy Suresh Comment

సౌత్‌లో ఎక్కువగా ట్రెడిషనల్ రోల్స్‌లోనే కనిపించిన కీర్తి సురేష్ నార్త్‌లో మాత్రం గ్లామర్‌ రోల్‌లో అదరగొట్టారు. కథ పరంగా పెద్దగా బోల్డ్ సీన్స్ లేకపోయినా… సాంగ్స్‌లో అదిరిపోయే రేంజ్‌లో గ్లామర్ షో చేశారు కీర్తి. ఆ తరువాత ప్రమోషన్ ఈవెంట్స్‌లోనూ అల్ట్రా గ్లామర్స్ లుక్స్‌లో అదరగొట్టారు. రీసెంట్ ఇంటర్వ్యూలో తన బాలీవుడ్ డెబ్యూ గురించి మాట్లాడిన కీర్తి సురేష్‌, తనకు నార్త్‎లో ఛాన్స్ రావడానికి రీజన్ ఎవరో రివీల్ చేశారు. బాలీవుడ్‌లో తెరి రీమేక్‌ ప్రపోజల్‌ వచ్చినప్పుడు ఆ సినిమాలో నటించిన సమంత హిందీ వర్షన్‌కు కీర్తీ సురేష్‌ పేరును సజెస్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా రివీల్ చేసిన కీర్తి సురేష్ సమంతకు థ్యాంక్స్ చెప్పారు.

నార్త్‌లో కీర్తి చేసిన రోల్‌ను ఒరిజినల్‌ లో సమంత ప్లే చేశారు. సామ్‌ చేసిన క్యారెక్టర్‌ తనకు ఎంతో ఇష్టమన్న కీర్తి సురేష్‌, రీమేక్ ప్రపోజల్‌ తన దగ్గరకు వచ్చినప్పుడు ముందు భయపడ్డానని గుర్తు చేసుకున్నారు. ఫైనల్‌గా బాలీవుడ్‌ లో బిగ్ ప్రాజెక్ట్‌తో అవకాశం రావటంతో ఫ్యూల్ హ్యాపీగా ఉన్నారు ఈ బ్యూటీ.

Also Read : Urvashi Rautela : బాలయ్య ‘నాకు మహారాజ్’ కు భారీ రెమ్యునరేషన్ తీసుకున్న బాలీవుడ్ బ్యూటీ

BollywoodCommentsKeerthy SureshTrendingUpdatesViral
Comments (0)
Add Comment