keerthy Suresh Varun Viral : కీర్తి సురేష్..ధావ‌న్ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో వీడియో హ‌ల్ చ‌ల్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డుపుతోంద‌న్న ప్ర‌చారం ఉండ‌గానే అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. తాజాగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం విశేషం.

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు వ‌రుణ్ ధావ‌న్ తో క‌లిసి కీర్తి సురేష్ ఉన్న‌ట్టుండి రోడ్డుపై వెళుతున్న ఆటోలో క‌నిపించింది. దీంతో ఒక్క‌సారిగా ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాయి.

ఇదిలా ఉండ‌గా ఇవాళ ప్ర‌తి విష‌యాన్ని పంచుకుంటున్నారు. మ‌రో వైపు ప్ర‌చారానికి వాడుకుంటున్నారు. కీర్తి సురేష్ , వ‌రుణ్ ధావ‌న్ క‌లిసి ఆటోలో ప్ర‌యాణం చేశారు. విచిత్రం ఏమిటంటే హీరో , హీరోయిన్ల‌కు స్వంతంగా కార్లు ఉంటాయి. వాళ్లు దీనిలోనే ఎందుకు జ‌ర్నీ చేశార‌నేది ఉత్కంఠ రేపింది ఫ్యాన్స్ లో.

ఆటోలో కీర్తి, వ‌రుణ్ ప్ర‌యాణం చేయ‌డం అనేది సినిమా షూటింగ్ లో ఒక భాగమ‌ని మ‌రికొంద‌రు నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. మొత్తంగా కీర్తి సురేష్ , వ‌రుణ్ హ‌ల్ చ‌ల్ చేశారు.

Comments (0)
Add Comment