Keerthy Suresh: ఉమెన్స్ క్రికెట్ టీం గుడ్ విల్ అంబాసిడర్ గా కీర్తిసురేశ్‌

ఉమెన్స్ క్రికెట్ టీం గుడ్ విల్ అంబాసిడర్ గా కీర్తిసురేశ్‌

Keerthy Suresh: మహానటి సినిమాతో జాతీయ అవార్డు సాధించి… తెలుగు, తమిళ, మలయాళం అని తేడా లేకుండా ప్రేక్షకులను మెప్పిస్తున్న వర్థమాన నటి కీర్తిసురేశ్‌. ఈ ఏడాది దసరా, మామన్నన్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న కీర్తిసురేశ్‌… ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాలతో బిజీబిజీగా ఉంది.

అయితే కీర్తిసురేశ్‌ తాజాగా కేరళ వుమెన్స్‌ క్రికెట్‌ టీంకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా నిమాయకమైంది. ఇదే విషయాన్ని కేరళ క్రికెట్ అసోసియేషన్ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో పాటు భారత్-ఆస్ట్రేలియా T20 మ్యాచ్‌ కోసం ఆన్‌లైన్‌ టికెట్‌ సేల్‌ను ఆమె చేత ప్రారంభించారు. ఈ సందర్భంగా కీర్తిసురేశ్‌(Keerthy Suresh) చేస మహిళల క్రికెట్‌ టీం కు సంబందించిన జెర్సీని లాంఛ్ చేయించారు. అనంతరం కీర్తిసురేశ్‌ మహిళల క్రికెట్ టీంతో కలిసి సెల్ఫీలు దిగి సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి.

Keerthy Suresh – కేరళ క్రికెట్ అసోసియేషన్ మొదటి గుడ్ విల్ అంబాసిడర్ గా మహానటి

కేరళ క్రికెట్ అసోసియేషన్ తన మహిళల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించడం ఇదే తొలిసారి. అయితే తొలిసారి కూడా కీర్తిసురేశ్‌ ను నియమించడం పట్ల ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాట్స్ కీర్తి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read : Dhruvanakshatram: మరోసారి ధృవ నక్షత్రం సినిమా వాయిదా

Keerthy Suresh
Comments (0)
Add Comment