Keerthy Suresh : తన 15 ఏళ్ల లవ్ స్టోరీని రివీల్ చేసిన మహానటి

12వతరగతి చదువుతున్నప్పుడే తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది కీర్తి...

Keerthy Suresh : సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగులో రెండో సినిమాకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇటీవలే తన స్నేహితుడితో కలిసి ఏడడుగులు వేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ హీరోయిన్ తన 15 ఏళ్ల ప్రేమకథను బయటపెట్టింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? తనే కీర్తి సురేష్(Keerthy Suresh). దక్షిణాది చిత్రపరిశ్రమలో చాలా పాపులర్ హీరోయిన్. ఇటీవలే తన చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్ ను పెళ్లి చేసుకుంది. గతనెల డిసెంబర్ 12న వీరిద్దరి వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన ప్రేమ, పెళ్లి విషయాలను పంచుకుంది.

Keerthy Suresh Comment

12వతరగతి చదువుతున్నప్పుడే తాను ఆంటోనీతో ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది కీర్తి(Keerthy Suresh). దాదాపు 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని తెలిపింది.“నేను మా కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు ఆంటోనీ కూడా వచ్చాడు. అక్కడ ఫ్యామిలీ ఉండడంతో కలవలేకపోయాను. కానీ కనుసైగ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయా.. ధైర్యం ఉంటే నాకు ప్రపోజ్ చేయమని చెప్పాను. 2010లో ఆంటోనీ నాకు మొదటిసారి ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి మా బంధం మరింత బలంగా ఉండిపోయింది. నాకు ప్రామిస్ రింగ్ కూడా ఇచ్చాడు. మా పెళ్లి వరకు ఆ రింగ్ తీయలేదు. నా సినిమాల్లోనూ ఆ రింగ్ మీరు చూడొచ్చు. మా పెళ్లి కోసం మేమిద్దరం 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచి కలలు కన్నాం. నాకంటే ఆంటోనీ ఏడేళ్లు పెద్ద. ఆరేళ్ల నుంచి ఖతార్ లో వర్క్ చేస్తున్నాడు. నా కెరీర్ కు చాలా సపోర్ట్ చేస్తాడు. ఆంటోనీ నా జీవితంలోకి రావడం నా అదృష్టం” అంటూ చెప్పుకొచ్చింది.

“మా ప్రేమ విషయం ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే తెలుసు. సమంత, విజయ్, అట్లీ, ప్రియా, ప్రియదర్శన్, ఐశ్వర్య లక్షి.. ఇలా కొందరికి మాత్రమే తెలుసు. ఆంటోనీకి బిడియం ఎక్కువ. మీడియా ముందు కూడా అందుకే కనిపించలేదు. ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రేమలో ఉన్నప్పటికీ 2017లో మొదటిసారి విదేశాలకు వెళ్లాం. రెండేళ్ల క్రితమే సోలో ట్రిప్ కు వెళ్లాం. 2022 నుంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. 2024లో డిసెంబర్ లో ఒక్కటయ్యాం. మా పెళ్లి తర్వాత సినిమా ప్రమోషన్లలో పసుపుతాడుతోనే కనిపిస్తున్నాను. మంచి ముహుర్తం చూసి మంగళసూత్రాలను బంగారు గొలుసులోకి మార్చుకుంటాను” అని తెలిపింది.

Also Read : Hero Ajith Kumar : కోలీవుడ్ హీరో అజిత్ సినిమాపై కాపీరైట్ కేసు..సెటిల్మెంట్ దశలో..

Keerthy SureshLove StorymarriageTrendingUpdatesViral
Comments (0)
Add Comment