Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా… తన నటనతో జాతీయ అవార్డు దక్కించుకుని… నిజంగానే మహానటి అని నిరూపించుకుంది మలయాళ కుట్టి కీర్తిసురేశ్(Keerthy Suresh). ఇటీవల దసరా, మామన్నన్ వంటి హిట్ సినిమాలతో దక్షిణాది భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కీర్తి… తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కీర్తి సురేశ్ ప్రధాన పాత్ర తెరకెక్కించిన సినిమా ‘రఘు తాత’. ఆగస్టు 15న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా అభిమానులతో ముచ్చటించిన ఈ మహానటి… తన పెళ్ళిపై వస్తున్న రూమర్స్ పై మరోసారి స్పందించారు. తన చిరకాల మిత్రుడిని కీర్తి పెళ్లాడబోతుందని వార్తలు కొద్దిరోజులుగా వైరల్ అవుతున్న తరుణంలో ఆమె స్పందించారు.
Keerthy Suresh Comment
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘‘ఏదైనా రూమర్ గురించి మనం వివరణ ఇస్తే అది నిజమేనని అందరూ భావిస్తాను. అందుకే అలాంటివాటిపై నేను స్పందించను. నా నటన లేదా సినిమాల ఎంపిక గురించి ఎవరైనా వివరణాత్మక విమర్శలు చేస్తే తప్పకుండా వాటిని స్వీకరిస్తాను. అలాంటి వాటినుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నా వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి ఎవరైనా కామెంట్స్ చేస్తే వాటిని పరిగణలోకి తీసుకోను. వివిధ కారణాల వల్ల వాళ్లు చేచేసే కామెంట్స్‌ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ను నేను పెళ్లాడనున్నానని వార్తలు వచ్చాయి. ఆ కథనాల్లో నిజం లేదు. దీనిపై ఇప్పటికే నా తల్లిదండ్రులు క్లారిటీ ఇచ్చారు’’ అని కీర్తి సురేష్ అన్నారు.
కీర్తి సురేశ్(Keerthy Suresh) నటించిన ‘రఘు తాత’ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. దృఢ సంకల్పం ఉన్న ఓ మహిళ చేేస స్ఫూర్తిదాయకమైన పోరాట కథను ఇందులో చూపించనున్నారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. అందులోని పలు సన్నివేశాలు చర్చనీయాంశంగా మారాయి. విద్యాభ్యాసం, ఉద్యోగంలో ఓ అమ్మాయి ఎలాంటి భాషాపరమైన ఇబ్బందులు ఎదుర్కొందనేది చూపిస్తూ టీజర్ రూపొందించారు.
Also Read : Committee Kurrollu: ‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ రిలీజ్ చేసిన డీజే టిల్లు !