Keerthy Suresh : అట్లీ జైల‌ర్ అదుర్స్ – కీర్తి సురేష్

ద‌ర్శ‌కుడికి న‌టి కితాబు

Keerthy Suresh : అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమెకు డైరెక్ట‌ర్ అట్లీ అంటే అభిమానం. అట్లీ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. త‌ను తీసే సినిమాల గురించి త‌ర‌చుగా కీర్తి సురేష్ తో పంచుకుంటాడు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్.

Keerthy Suresh Appreciates Atlee

తాజాగా షారుక్ ఖాన్ , న‌య‌న తార‌, దీపికా ప‌దుకొనే, విజ‌య్ సేతుప‌తితో తీసిన జైల‌ర్ చిత్రం దుమ్ము రేపుతోంది. మూడు రోజుల్లోనే రూ. 330 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సంద‌ర్భంగా అట్లీ కుమార్ ఇంటికి వెళ్లిన కీర్తి సురేష్(Keerthy Suresh) ద‌ర్శ‌కుడికి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ చేసింది.

అంతే కాదు వారితో క‌లిసి ఉన్న ఫోటోల‌ను పంచుకుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా అట్లీ కుమార్ క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాడు. త‌మిళ‌నాడులో టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు.

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌ని చేశాడు. కానీ స‌మాజం ప‌ట్ల త‌న‌కు ఉన్న నిబ‌ద్ద‌త‌ను కోల్పోలేదు. త‌ల‌ప‌తి విజ‌య్ కు వ‌రుస‌గా హిట్స్ ఇచ్చాడు. త‌మిళంలో తీసిన బిజిల్ (విజిల్) లో జీఎస్టీని ప్ర‌శ్నించాడు. తాజాగా తాను జ‌వాన్ లో ఓటు విలువ ఏమిటో చెప్పాడు.

Also Read : Lokesh Kanagaraj : ర‌జ‌నీకాంత్ తో లోకేష్ మూవీ

Comments (0)
Add Comment