Keerthy Suresh: డైరెక్ట్ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్‌ ‘సైరన్‌’ సినిమా !

డైరెక్ట్ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్‌ 'సైరన్‌' సినిమా !

Keerthy Suresh: ప్రముఖ కోలీవుడ్ నటుడు జయం రవి, మహానటి కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా ‘సైరన్‌’. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ కీలక పాత్రలో మెరిసింది. మొదట్లో నేరుగా ఓటీటీలోకి రానుందని ప్రచారం జరిగింది. అయితే తెలుగు, తమిళ భాషల్లో థియేటర్‌ లో విడుదల చేశాకే ఓటీటీలో రిలీజ్‌ చేస్తామని చిత్రయూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలనుకున్న ఈ సినిమాను పలు వాయిదాల తర్వాత తమిళంలో ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళనాట మరీ అంత పాజిటివ్‌ స్పందన లేకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్‌ చేయనున్నారు. ఏప్రిల్‌ 19 నుంచి డిస్నీ హాట్‌ స్టార్‌ లో ‘సైరన్‌’ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైరన్‌ అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.

Keerthy Suresh – ‘సైరన్‌’ కథేమిటంటే ?

ఖైదీ పాత్రలో ‘జయం’ రవి, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో కీర్తి సురేష్‌(Keerthy Suresh) నటించారు. భార్య(అనుపమ పరమేశ్వరన్‌)ను హత్య చేసిన కేసులో రవి జైలుకెళ్తాడు. పెరోల్‌పై బయటకు వచ్చిన సమయంలో ఓ లీడర్‌ ను, పోలీస్‌ను హత్య చేస్తాడు. ఈ కేసు కీర్తి సురేశ్‌ ఇన్వెస్టిగేట్‌ చేస్తుంది. ప్రేమించి పెళ్లాడిన భార్యను నిజంగానే రవి చంపేశాడా ? కీర్తి కేసును ఎలా సాల్వ్‌ చేసింది ? అనేది తెలియాలంటే ? ఈ సినిమాను ఓటీటీలో చూడాల్సిందే.

Also Read : Committee Kurrollu: నిహారిక కొణిదెల సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా !

Jayam RaviKeerthy SureshSiran
Comments (0)
Add Comment