Keerthy Suresh : ఇటీవలే నటి కీర్తి సురేశ్ తన చిరకాల స్నేహితుడు, కేరళకు చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తట్టిల్‌ని పెళ్లిచేసుకోబోతున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన కీర్తి సురేశ్(Keerthy Suresh).. తన రిలేషన్ స్టేటస్‌పై స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు దీపావళీ రోజున ఆంటోనీతో కలసి తీసుకున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఆంటోనీతో నాది 15 ఏళ్ల అనుబంధం. ఇక ముందూ మా ఇద్దరి బంధం ఇలాగే కొనసాగనుంది’’ అని తమ రిలేషన్‌షిప్ గురించి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి వెంకన్న సాక్షిగా ఆమె మరో విషయంపై క్లారిటీ ఇచ్చారు.
Keerthy Suresh Comment..
ఈరోజు(శుక్రవారం) ఉదయం కీర్తి సురేష్ తన ఫ్యామిలీతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో పాల్గొన్న ఆమె రంగనాయకుల మండపంలో పండితుల వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి గురించి చెప్పారు. వచ్చే నెలలో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నాని వెల్లడించారు. ఇక తన బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ కూడా వచ్చే నెలలోనే రిలీజ్ ఉండటంతో స్వామి వారి దర్శనానికి వచ్చానని తెలిపారు. మరోవైపు డిసెంబరు 11న గోవాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో వీరి వివాహం జరగనుందనీ, పెళ్లికి రెండు రోజుల ముందే డిసెంబరు 9న వివాహ వేడుకలు ఆరంభమవుతాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ ప్రముఖులు కీర్తి సురేశ్‌కు అభినందనలు తెలుపుతున్నారు.
Also Read : AR Rahman : ఏఆర్ రెహమాన్, సైరాభాను ల విడాకులపై అడ్వకేట్ కీలక వ్యాఖ్యలు