Keerthy Suresh : తన రాజకీయ ప్రవేశం పై క్లారిటీ ఇచ్చిన మహానటి

ఈ సందర్భంగా హీరోయిన్‌ కీర్తి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ....

Keerthy Suresh : మూసధోరణిలో కాకుండా విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకుంటూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క‌థానాయిక‌ కీర్తి సురేష్. తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘రఘుతాతా’. ‘ కేజీఎఫ్‌’, ‘కాంతార’, ‘సలార్‌’ వంటి పాన్‌ ఇండియా చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాతో త‌మిళ సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్ట‌డం విశేషం. ‘ ది ఫ్యామిలీ మ్యాన్‌’, ‘ఫార్సీ’ వంటి హిట్‌ వెబ్‌ సిరీస్‌లకు కథా రచయితగా పని చేసిన సుమన్‌ కుమార్‌ ఈ సినిమాకు దర్శకుడు. గ‌తంలో హిందీ వ్యతిరేక నిరసన ఉద్య‌మంలో పాల్గొన్న ఓ వ్యక్తి తన పదోన్నతి కోసం హిందీ పరీక్ష రాసిన నేప‌థ్యం ఈ చిత్రానికి మూలకథ. ఈ చిత్రంలో హిందీ భాషను మహిళలపై బలవంతంగా రుద్దడాన్ని కామెడీ టచ్‌తో రూపొందించారు. ఇటీవ‌ల ఈ మూవీ త‌మిళ‌నాట‌ విడుదలైంది.

Keerthy Suresh Comment

ఈ సందర్భంగా హీరోయిన్‌ కీర్తి సురేష్‌(Keerthy Suresh) మీడియాతో మాట్లాడుతూ.. ‘రఘుతాతా’ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే చిత్రం. హిందీ నేర్చుకోవడాన్ని ఏ ఒక్కరూ వ్యతిరేకించడం లేదు. కానీ, హిందీ నేర్చుకోవాలంటూ బలవంతం చేయడాన్నే వ్యతిరేకించామ‌న్నారు. అలాగే, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలతో పాటు వారికి విధించే ఆంక్షలను ఇందులో చూపించామ‌న్నారు. పాప్‌కార్న్‌ తింటూ కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడొచ్చన్నారు. స్త్రీలు నిరాడంబరంగా ఉండాలి. సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన చిన్నచిన్న విషయాలను కూడా ఇందులో సెటైరికల్‌గా చూపించామ‌ని తెలిపింది. ప్ర‌స్తుతం నా దృష్టంతా సినిమాలపైనే ఉంద‌ని, రాజకీయాల్లోకి వచ్చే అవకాశమే లేదు అని ఆమె స్పష్టం చేశారు. కాగా కీర్తి సురేష్ ఇప్పుడు ‘బేబీ జాన్‌’తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్ట‌బోతోంది. సమంత, విజయ్‌ కాంబోలో వచ్చిన ‘తెరీ’ రీమేక్‌గా ఈ చిత్రం సిద్థమవుతోంది. ఈ సినిమా ఈ క్రిస్మ‌స్‌కు రిలీజ్ కానుంది.

Also Read : Arshad Warsi : కల్కిలో ప్రభాస్ పాత్రను విమర్శించిన బాలీవుడ్ నటుడు

CommentsIndian ActressesKeerthy SureshViral
Comments (0)
Add Comment