Keerthy Suresh : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి మూవీతో దేశ వ్యాప్తంగా పేరు పొందిన కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాలలో నటించింది..పలువురు మనసులను గెలుచుకుంది. ఈ అమ్మడు ఇటీవలే ఓ ఇంటిదైంది. తాజాగా తనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. కొత్త ప్రాజెక్టు కోసం కథ పూర్తయిందని, ఓకే కూడా చెప్పేసిందని ప్రచారం జరుగుతోంది మహానటి గురించి.
Keerthy Suresh Gives Green Signal to Bollywood Movie
వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో యానిమల్ లో నటించిన స్టార్ హీరో రణ బీర్ కపూర్ తో ఈ అమ్మడు జత కట్టనుంది. మరో వైపు పెళ్లి అయ్యాక కీర్తి సురేష్(Keerthy Suresh) కు వరుసగా ఛాన్సులు రావడం విస్తు పోయేలా చేస్తోంది సినీ ఇండస్ట్రీని. రౌడీ బాయ్ గా పేరొందిన విజయ్ దేవరకొండతో కూడా కీర్తి సురేష్ నటించనుంది. ఈ ఇద్దరు కలిసి గతంలో మహానటి మూవీలో నటించారు. వీరి కాంబినేషన్ బాగుంటుందని అంచనా. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే మూవీ రౌడీ జనార్దన్.
ప్రస్తుతం తమిళంలో అక్క, రివాల్వర్ రీటా చిత్రాలలో బిజీగా ఉంది కీర్తి సురేష్. ఇక రణ బీర్ కపూర్ కు కథ చెప్పారని, దానిని ఓకే చేశాడని, కీర్తీ సురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తాజాగా ఈ అప్ డేట్ కు సంబంధించి తను సోషల్ మీడియా వేదికగా గిబిలి ఫోటోలను షేర్ చేసింది. హిందీలో బేబీ జాన్ లో నటించింది. మరో క్రేజీ కాంబోతో రాబోతుండటం విశేషం. అయితే ఇంకా ఈ సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Also Read : Prakash Raj Shocking :ఆక్షన్ సరే ఆక్సిజన్ లేకుండా చేస్తే ఎలా..?