Keerthy Suresh: ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా… తన నటనతో జాతీయ అవార్డు దక్కించుకుని… నిజంగానే మహానటి అని నిరూపించుకుంది మలయాళ కుట్టి కీర్తిసురేశ్. ఇటీవల దసరా, మామన్నన్ వంటి హిట్ సినిమాలతో దక్షిణాది భాషల్లో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కీర్తి(Keerthy Suresh)… తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు అభిమానులను ఆకట్టుకోవడానికి ఓటీటీ ప్రపంచంలో కూడా అడుగుపెడుతోంది. యశ్‌రాజ్ ఫిలింస్ నిర్మాణంలో యువ దర్శకుడు ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘అక్కా’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టేతో కలిసి సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమా కోసం కేరళకు మకాం మార్చిన కీర్తి సురేశ్… ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఓ ఆశక్తికరమైన విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీనితో కీర్తి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Keerthy Suresh Movie Updates
యశ్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఇటీవల కేరళలో పూర్తయింది. దీనితో దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానంటూ కీర్తి సురేశ్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్‌లో నటించడం చాలా సంతోషంగా ఉంది. ఈ షెడ్యూల్‌ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర సినిమాల షూటింగ్ లకు హాజరవుతానని తెలిపారు. కాగా ప్రస్తుతం కీర్తి సురేశ్… తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం.
Also Read : Committee Kurrollu: నిహారిక కొణిదెల సమర్పణలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా !