Keerthy Suresh : ఆ విశ్యానికి వస్తే చిరు కంటే దళపతి ది బెస్ట్

ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...

Keerthy Suresh : అందాల భామ కీర్తిసురేష్ ప్రస్తుతం తెలుగు తమిళ్ సినిమాలతో ఫుల్ బిజిగ ఉంది. వీటితో పాటు ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటడానికి రెడీ అవుతుంది. తెలుగులో కీర్తిసురేష్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మన దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నేను శైలజ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. అలాగే తమిళ్ లోనూ సూపర్ హిట్ సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో జతకట్టి టాప్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం తమిళ్ లో రఘుతాత అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీగా రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

Keerthy Suresh Comment

ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. తాజాగా కీర్తిసురేష్(Keerthy Suresh) ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. దాంతో కీర్తిసురేష్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ ఇంటర్వ్యూలో కీర్తిసురేష్ మాట్లాడుతూ.. చిరంజీవి కంటే దళపతి విజయ్ డాన్స్ బాగా చేస్తారు అని కామెంట్ చేసింది. దాంతో కొందరు మెగా ఫాన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

దళపతి విజయ్ తో ‘భైరవ’, ‘సర్కార్’ అనే సినిమాల్లో నటించింది కీర్తిసురేష్. అలాగే మెగాస్టార్ చిరంజీవితో భోళాశంకర్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించింది. ఇక ఇప్పుడు కీర్తిసురేష్ చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపుతోంది. దళపతి విజయ్ పై ఉన్న అభిమానంతో ఆమె అలా చెప్పి ఉండొచ్చు అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం మెగాస్టార్ డాన్స్ ను వంక పెడతావా అంటూ ఆమె పై ట్రోల్స్ చేస్తున్నారు. మరి ఈ ట్రోల్స్ పై కీర్తిసురేష్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read : Darling OTT : ఓటీటీలోకి నభా నటేష్ నటించిన రొమాంటిక్ సినిమా ‘డార్లింగ్’

BreakingCommentsKeerthy SureshViral
Comments (0)
Add Comment