Keerthy Suresh : కథానాయిక కీర్తిసురేశ్ పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. నేడు ఆమె తన ప్రియుడు ఆంటోని తట్టిల్‌తో ఏడడుగులు వేయనున్నారు. గోవాలోని ప్రముఖ రిసార్ట్ వీరి పెళ్లికి వేదిక కానుంది. బుధవారం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు సిద్ధమవుతున్న ఫొటోను కీర్తి ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశారు. ఇప్పటికే ఇరువైపులా కుటుంబ సభ్యులు గోవాకు చేరుకున్నారు.
Keerthy Suresh Marriage
హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనుంది. కీర్తి, ఆంటోని పేర్లలోని తొలి అక్షరాలు ‘కే ఏ’ను ముద్రించిన హ్యాండ్ బ్యాండ్స్ అతిథులకు అందించేందుకు సిద్ధం చే శారు. అలాగే అతిథుల గదుల్లో తమ పెళ్లికి సంబంధించిన విశేషాలను తెలుపుతూ ముద్రించిన ‘వెల్‌కమ్ టూ ద వెడ్డింగ్ మ్యాడ్‌నెస్’ అనే మ్యాగజైన్స్‌ను కీర్తి ఉంచారట. కీర్తిసురేశ్ సన్నిహితులైన కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
Also Read : Rajinikanth : ఒకప్పటి ఆర్టీసీ కండక్టర్…ఇప్పటి హీరో తలైవాకు జన్మదినం