Keeda Kola Movie : బ్రహ్మానందం నటించిన తరుణ్ భాస్కర్ తీసిన కీడా కోలాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. పూర్తిగా కామెడీ, క్రైమ్ నేపథ్యంతో తీశాడు దర్శకుడు. గతంలో పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు తీసి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న భాస్కర్(Tharun Bhascker) డిఫరెంట్ కథతో ముందుకు వచ్చాడు కీడా కోలాతో.
Keeda Kola Movie Updates
ఈ చిత్రానికి డిఫరెంట్ పేరు పెట్టడం కూడా అదనపు ఆకర్షణగా మారింది. దిగ్గజ నటుడు బ్రహ్మానందం కీ రోల్ పోషించడం విశేషం. చాలా కాలం తర్వాత ఎన్నో సినిమాలలో నటించినా రాని సంతృప్తి కీడా కోలాతో తనకు కలిగిందని చెప్పారు బ్రహ్మి. అంతే కాదు తనకు ఆనాటి జంధ్యాల గుర్తుకు వచ్చాడు తరుణ్ భాస్కర్ ను చూస్తుంటేనని పేర్కొన్నారు.
కీడా కోలా(Keeda Kola) ప్రమోషన్స్ కు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోందని చెప్పారు దర్శకుడు తరుణ్ భాస్కర్. సినీ క్రిటిక్స్ కూడా మంచి మార్కులే ఇచ్చారు కీడా కోలాకు. తొలి రోజే రూ. 2 కోట్లకు పైగా వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఏది ఏమైనా ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ఇందులో తరుణ్ భాస్కర్ , బ్రహ్మానందం, రఘు రామ్ , విష్ణు ఓయి, జీవన్ కుమార్, చైతన్య రావు, రాజ్ మయూర్ తదితరులు నటించారు.
Also Read : Ghost Movie : భయ పెడుతున్న శివన్న