KCR: ‘కేసీఆర్’ సినిమాలో పాటను విడుదల చేసిన మాజీ సీఎం కేసీఆర్ !

'కేసీఆర్' సినిమాలో పాటను విడుదల చేసిన మాజీ సీఎం కేసీఆర్ !

‘కేసీఆర్’ సినిమాలో పాటను విడుదల చేసిన మాజీ సీఎం కేసీఆర్ !

 

 

జబర్దస్త్ ఫేం రాకింగ్‌ రాకేశ్‌ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కేసీఆర్‌’ (కేశవ చంద్ర రమావత్‌). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తున్నారు. ‘పదగతులు స్వరజతులు పల్లవించిన నేల… తేనె తీయని వీణ రాగాల తెలంగాణ .’ అంటూ సాగే ఈ సినిమాలోని తెలంగాణ తేజం పాటని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేశారు. గోరటి వెంకన్న రచించిన ఈ పాటకి, చరణ్‌ అర్జున్‌ స్వరాలు సమకూర్చారు. మను కల్పన, గోరటి వెంకన్న కలిసి ఆలపించారు. పాట బాగుందని చిత్రబృందాన్ని అభినందించారు కేసీఆర్‌. ఈ కార్యక్రమంలో దీవకొండ దామోదర్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, జోగినపల్లి సంతోష్‌కుమార్, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, చరణ్‌ అర్జున్, జోర్దార్‌ సుజాత, విహ, సంజయ్‌ మహేశ్‌ తదితర రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

kcrRocking Rakesh
Comments (0)
Add Comment