Kayadu Lohar : ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ చిత్రం ఊహించని రీతిలో బిగ్ సక్సెస్ మూటగట్టుకుంది. ఈ చిత్రంలో తనతో పాటు అద్భుతంగా నటించడమే కాదు కుర్రకారు గుండెలను మీటింది అందాల ముద్దుగుమ్మ కయాదు లోహర్(Kayadu Lohar). తెలుగులో అల్లూరి సినిమాలో నటించినా ఆశించిన మేర ఆడలేదు. కానీ తాజాగా రిలీజ్ అయిన డ్రాగన్ ఏకంగా వారం రోజుల్లోనే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ విమర్శకులను సైతం విస్తు పోయేలా చేసింది డ్రాగన్.
Kayadu Lohar Got Chance
ఇటీవల డ్రాగన్ ఈవెంట్ సందర్బంగా ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ప్రదీప్ రంగనాథన్ తో సినిమా తీయాలని ఉందన్నాడు. అతనిలోని నటన తనకు బాగా నచ్చిందన్నాడు. ఇదే సమయంలో కయాదు లోహర్ గురించి కూడా ఆసక్తిర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే రోజుల్లో ఎవరూ ఊహించని ప్లేస్ లోకి తను వెళుతుందన్నాడు.
ఆయన ఏ ముహూర్తంలో అన్నాడో కానీ కయాదు లోహర్ కు బంపర్ ఆఫర్ వచ్చింది తెలుగులో. అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ మూవీకి ఎంపికైనట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో విశ్వక్ సేన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని, మిగతా పాత్రలో లోహర్ ను దాదాపు ఖరారు చేసినట్లు టాక్.
Also Read : Hero Sandeep Kishan :తలైవా కూలీ బ్లాక్ బస్టర్ పక్కా