Kavita Krishnamurthy: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, సీనియర్ నేపథ్య గాయని కవితా కృష్ణమూర్తి(Kavita Krishnamurthy) యూకే ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్ (యూకేఏఎఫ్‌ఎఫ్) జీవితకాల సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. లండన్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఈ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఆమె భారతీయ సంగీతానికి చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీనితో కవితా కృష్ణమూర్తికి సినీ ప్రముఖులు, సంగీత ప్రముఖుల నుండి ప్రశంసలు ముంచెత్తుతున్నాయి.
Kavita Krishnamurthy Award…
‘తూ ఛీజ్ బడీ హై మస్త్’, ‘కోయీ మిల్‌గయా’, ‘డోలా రే డోలా రే’, ‘బోలె ఛూడియా..’ ఇలాంటి వందలకొద్దీ హిట్‌లు బాలీవుడ్ కి అందించారామె. తన నలభై ఏళ్ల కెరీర్‌లో 45 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీ, బెంగాలీ, కన్నడ, రాజస్థానీ, భోజ్‌పురి, తెలుగు, ఒడియా, మరాఠీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, మలయాళం, గుజరాతీ, నేపాలీ, అస్సామీ, కొంకణి, పంజాబీ భాషలలో కవిత కృష్ణమూర్తి పాటలు పాడింది. ఆమె నాలుగు ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులు గెలుచుకుంది. 2005లో కవిత కృష్ణమూర్తి పద్మశ్రీ పురస్కారాన్ని పొందింది. ‘ఈ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డు అందుకోవడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. నన్ను ఎంపిక చేసినవారికి కృతజ్ఞతలు’ అంటూ ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read : Pushpa 2 : పుష్పరాజ్ కోసం క్యూ కడుతున్న పాన్ ఇండియా సెలెబ్రెటీలు