Kausalya Tanaya Raghava : ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజేష్ కొచ్చాడా, శ్రావణి శెట్టి కలిసి నటించిన చిత్రం కౌసల్య తనయ(Kausalya Tanaya Raghava) రాఘవ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇంటిల్లిపాదిని ఆకట్టుకునేలా ఉంది. ఫీల్ గుడ్ అనిపించేలా చిత్రీకరించారు దర్శకుడు. ఓ వైపు మాస్, యాక్షన్, వయొలెన్స్ ఎక్కువగా ఇప్పుడు సినిమాలలో కనిపిస్తున్నాయి. అంతకంటే ఎక్కువగా బూతు రాజ్యం ఏలుతోంది. ద్వందార్థాలు పెరిగి పోయాయి. హీరో , హీరోయిన్ల భాష దారుణంగా ఉంటోంది. మనసుకు నచ్చేలా కొన్ని సినిమాలు మాత్రమే వస్తున్నాయి.
Kausalya Tanaya Raghava Trailer Sensational
అలాంటి కోవలోకి వచ్చిందే కౌసల్య తనయ రాఘవ. అడపా రత్నాకర్ దీనిని నిర్మించారు. కథతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు స్వామి పట్నాయక్(Swami Patnaik). ఈ సినిమాను ఏప్రిల్ 11న విడుదల చేయనున్నారు. పోస్టర్స్, టీజర్, పాటలు అన్నీ కూడా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. చంటి,, ఆర్కే నాయుడు, రత్నాకర్ సంయుక్తంగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ చిత్రం వాస్తవ కథకు అద్దం పట్టేలా ఉంది.
ప్రధానంగా 1980 దశకంలో జరిగిన ఘటనను ఆధారంగా తీసుకుని సినిమా ప్లాన్ చేశారు. ప్రధానంగా జీవితంలో అత్యంత ముఖ్యమైనది చదువు ఒక్కటేనని, దానిని విస్మరించ కూడదంటూ సందేశం ఇచ్చాడు ఈ సినిమా ద్వారా దర్శకుడు స్వామి పట్నాయక్. యోగి రెడ్డి కెమెరా పనితనం మరింత హైలెట్ గా నిలిచింది. రాజేష్ రాజ్ తేలు సినిమాకు అందించిన సంగీతం ప్రాణం పోసిందని చెప్పక తప్పదు. మొత్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
Also Read : Hero Ram Charan-Peddi :రిలీజ్ కాకుండానే ‘పెద్ది’ సెన్సేషన్