Katrina Kaif : డ్యాన్స్ అంటే చ‌చ్చేంత ఇష్టం

అవునంటున్న క‌త్రీనా కైఫ్

క‌త్రినా కైఫ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా న‌టించింది. విక్ట‌రీ వెంకటేశ్ తో క‌లిసి న‌టించిన మ‌ల్లీశ్వ‌రి మూవీ. చాలా గ్యాప్ త‌ర్వాత బాలకృష్ణ‌తో సినిమాలో మెరిసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీగా మారి పోయింది.

త‌ను కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ తో పోటీ ప‌డి న‌టించింది టైగ‌ర్ -3. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి ఈ చిత్రంపై. ఇందుకు సంబంధించిన ఫోటోలు, ట్రైల‌ర్ , సాంగ్ కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కింది.

టైగ‌ర్ మూవీ భారీ క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టింది. అందుకే ద‌ర్శ‌కుడు మ‌రోసారి ఈ చిత్రంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. భారీ యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్, రొమాన్స్ పండించేలా చేశాడు. ఇదిలా ఉండ‌గా క‌త్రినా కైఫ్ టైగ‌ర్ -3లో కీల‌క పాత్ర పోషించింది.

ఈ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది ఈ ముద్దుగుమ్మ‌. త‌న‌కు డ్యాన్స్ చేయ‌డం అంటే ఎంతో ఇష్ట‌మ‌ని, అలా చేయ‌కుండా ఉండ‌లేనంటోంది క‌త్రీనా కైఫ్. ప్ర‌స్తుతం ఈ అందాల సుంద‌రి చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. స‌ల్మాన్ తో ఎలా ఇర‌గ‌దీసిందోనంటూ ఫ్యాన్స్ ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

Comments (0)
Add Comment