Kasthuri Shankar : ప్రముఖ నటి కస్తూరి ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోసారి ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తను సినిమా కోసం ఓ డైరెక్టర్ కు బికినీ ఫోటోలు పంపించానని, కానీ సెలెక్టు కాలేదని పేర్కొంది. ఓ ఛానల్ తో జరిగిన చర్చా గోష్టి సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను పంచుకుంది. ఇప్పటికే పలు హాట్ ఫోటోస్ , కామెంట్స్ తో కస్తూరి వైరల్ అవుతూ వస్తున్నారు.
Kasthuri Shankar Comments Viral
కస్తూరి గతంలో శంకర్(Kasthuri Shankar) తీసిన భారతీయుడు, కె. రాఘవేంద్రరావు తీసిన అన్నమయ్య, పెద్దరికం చిత్రాలలో నటించింది. ఆమె మంచి నటన ప్రదర్శించినా ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు రాలేదు. మరో వైపు సోషల్ మీడియా రావడంతో చాలా మంది నటీనటులు ఆసక్తికర, సీరియస్ కామెంట్స్ చేస్తూ వైరల్ గా మారుతున్నారు.
వాస్తవానికి భారతీయుడులో తాను కీలక పాత్రలో నటించాల్సి ఉందని, కానీ ఆ సమయంలో తన వయసు చిన్నగా ఉండడంతో డైరెక్టర్ తనను మెయిన్ హీరోయిన్ గా తీసుకోలేదని వాపోయింది. అయితే బికినీ డ్రెస్ తో ఫోటోలు పంపించింది వాస్తవమేనని పేర్కొంది.
ఏది ఏమైనా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది కస్తూరీ శంకర్. మొత్తంగా ఆమె తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Hai Nanna Movie : డిసెంబర్ 7న హాయ్ నాన్న