Kartik Aaryan : సినిమాల మీద ఉన్న ఇష్టంతో నా ప్రేమను దూరం చేసుకున్న

సినిమా మీద ఇష్టంతో కాలేజ్‌ డేస్‌లో ప్రేమను కూడా వదులు కోవాల్సి వచ్చిందన్నారు...

Kartik Aaryan : ప్రజెంట్ బాలీవుడ్‌లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కార్తీక్‌ ఆర్యన్ తన కెరీర్‌ ఎర్లీ డేస్‌ను గుర్తు చేసుకున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తిక్‌, హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా కష్టపడ్డారు. సమయంలో ఎదురైన అవమానాలను గుర్తు చేసుకున్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో వరుస సక్సెస్‌లు సాధిస్తున్న వన్‌ అండ్ ఓన్లీ హీరో కార్తిక్ ఆర్యన్‌. బాలీవుడ్ కష్టాల్లో ఉన్న టైమ్‌లో కూడా బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీని ఆదుకున్నారు ఈ యంగ్ హీరో. అందుకే ప్రజెంట్ నార్త్ సినిమాలో మిస్టర్ డిపెండబుల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ రేంజ్‌కు రావడానికి తాను ఎంతో కష్ట పడ్డా అన్నారు కార్తిక్ ఆర్యన్‌(Kartik Aaryan). కెరీర్‌ స్టార్టింగ్‌లో పర్సనల్ అండ్ ప్రొఫెషనల్‌ లైఫ్‌లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.

Kartik Aaryan Comment

సినిమా మీద ఇష్టంతో కాలేజ్‌ డేస్‌లో ప్రేమను కూడా వదులు కోవాల్సి వచ్చిందన్నారు. తాజాగా ఓ పాడ్‌ కాస్ట్‌లో పాల్గొన్న కార్తిక్‌, గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత అవకాశాల కోసం చాలా రోజులు ఎదురుచూడాల్సి వచ్చిందని, ప్రతీ ఆడిషన్‌లో రిజెక్ట్ అవ్వటంతో ఫ్రస్ట్రేషన్‌ వచ్చేది అని గుర్తు చేసుకున్నారు. అయితే తొలి సక్సెస్‌తో ఆ కష్టాలన్ని మరిపోయానని, ప్రజెంట్ కెరీర్‌ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి తన కష్టమే కారణం అన్నారు.

Also Read : Tripti Dimri : అభిమానులు ట్యాగ్ లైన్ తో పాటు బాధ్యతలు కూడా ఇచ్చారు

CommentsKartik AryanUpdatesViral
Comments (0)
Add Comment