Karthik Aryan : లవ్లీ బ్యూటీ శ్రీలీల, కార్తీక్ ఆర్యన్ నిజంగానే డేటింగ్ లో ఉన్నారా..అవుననే అంటోంది కార్తీ తల్లి మాలా తివారీ. ఐఐఎఫ్ఏ డిజిటల్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన చిట్ చాట్ లో కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) తల్లి కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు వైద్యురాలైన కోడలు కావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అంటే శ్రీలీల ప్రస్తుతం డాక్టర్ కోర్సు చదువుతోంది. దేశ వ్యాప్తంగా పుష్ప2 మూవీలో కిస్సక్ అంటూ దుమ్ము రేపింది. కుర్రకారు గుండెలను మీటింది ఈ ముద్దుగుమ్మ.
Karthik Aryan Wife..
ఇదే సమయంలో ఇటీవల కార్తీక్ ఆర్యన్ తన సోదరి కార్యక్రమంలో శ్రీలీల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తను డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు నటుడు. వీరిద్దరూ కలిసి నాడియావాలా తీస్తున్న ఆషికి 3లో నటిస్తున్నారు. ఇద్దరూ ముద్దు పెట్టుకుంటున్న పోస్టర్స్, వీడియో వైరల్ గా మారాయి.
కాగా కార్తీక్ ఆర్యన్ మదర్ చెప్పినట్లు తనకు మంచి డాక్టర్ చదువుకున్న కోడలు కావాలని ఉందంటూ స్పష్టం చేసింది. దీంతో శ్రీలీలను తన కోడలిగా కన్ ఫర్మ్ చేసినట్టేనని జోరుగా ప్రచారం జరుగుతోంది.
“భూల్ భూలైయా 2” లో నటించిన కార్తీక్ ఆర్యన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాడు. శ్రీలీలతో పీకల లోతు ప్రేమలో కూరుకు పోయాడని టాక్. ఈ ఇద్దరూ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం డేటింగ్ లో ఉన్నట్లు తెలిసేలా చేస్తోందంటున్నారు ఫ్యాన్స్. ఇదే సమయంలో కార్తీక్ ఆర్యన్ తల్లి చేసిన కామెంట్స్ ఇందుకు మరింత బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి.
Also Read : Chhaava OTT Sensational :ఏప్రిల్ 11న నెట్ ఫ్లిక్స్ లో ఛావా స్ట్రీమింగ్