Kareena Kapoor: దక్షిణాది భాష సినిమాలో కరీనా కపూర్‌ ?

దక్షిణాది భాష సినిమాలో కరీనా కపూర్‌ ?

Kareena Kapoor: ప్రేమకథలు, యాక్షన్‌, కామెడీ… ఇలా జానర్‌ ఏదైనా తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న బాలీవుడ్‌ అగ్రకథానాయిక కరీనా కపూర్‌. ‘రిఫ్యూజ్‌’తో పరిశ్రమలోకి అడుగుపెట్టి… ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. మరికొద్ది రోజుల్లో బాలీవుడ్ బ్యూటీలు టబు, కృతి సనన్ తో కలిసి ‘ది క్రూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా ఎయిర్‌హోస్టెస్‌గా సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది.

Kareena Kapoor Movie Updates

అయితే ‘ది క్రూ’ సినిమాతో పాన్ ఇండియా అభిమానులు పలకరించడానికి వస్తున్న ఈ భామ… ఇప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో కూడా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘ది క్రూ’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ… కరీనా కపూర్(Kareena Kapoor) ఆశక్తికరమైన విషయాలను వెల్లడించింది. ‘‘నేను త్వరలో ఓ భారీ ప్రాజెక్టుతో దక్షిణాది చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నాను. అది పాన్‌-ఇండియా ప్రాజెక్టు. మొదటిసారి ఇలాంటి సినిమాలో పనిచేస్తున్నాను. దీని కోసం ఎదురుచూస్తున్న అభిమానుల ఆసక్తిని నేను అర్థంచేసుకోగలను’’ అంటూ చెప్పుకొచ్చింది. దీనితో కన్నడ కథానాయకుడు యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’లో కరీనా కనిపించనున్నట్లు ప్రేక్షకుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి.

దక్షిణాది భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న తరువాత బాలీవుడ్ లో స్థిరపడిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. కాని బాలీవుడ్ లో స్థిరపడిన తరువాత దక్షిణాది భాషల్లోకి రావడంపై కరీనా కపూర్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Also Read : Sidhu Moose Wala: 58 ఏళ్ళ వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సింగర్ సిద్దు మూసేవాలా తల్లి !

Kareena KapoorSaif Ali Khanyash
Comments (0)
Add Comment