Kareena Kapoor: ‘దిశ’ ఘటన ఆధారంగా బాలీవుడ్ సినిమా ?

'దిశ' ఘటన ఆధారంగా బాలీవుడ్ సినిమా ?

Kareena Kapoor: హైదరాబాద్ శివార్లలో ఓ యువతిపై జరిగిన అత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత హైదరబాద్ లో జరిగిన దిశ ఘటన దేశ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ కేసులో ప్రధాన నిందితులను హైదరబాద్ సీపీ సజ్జనార్ ఎన్ కౌంటర్ చేయడం… ఆ తరువాత ఇటువంటి దిశ ఘటనలను నియంత్రించడానికి ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దిశ ఘటనను వెండి తెరపై ఆవిష్కరించే ప్రయత్నం బాలీవుడ్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా తెరకెక్కించడానికి ప్రముఖ దర్శకురాలు మేఘనా గుల్జార్‌ సన్నాహాలు మొదలుపెట్టారట.

Kareena Kapoor Movies

ఈ సినిమాలో కరీనా కపూర్, ఆయుష్మాన్‌ ఖురానాలు ప్రధాన పాత్రలకు ఎంపిక చేశారని సమాచారం. కరీనా, ఆయుష్‌ ఈ స్క్రిప్ట్‌ చదివి, గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ‘తల్వార్, రాజీ, చపాక్, సామ్‌ బహదూర్‌’ వంటి చిత్రాలతో మంచి దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు మేఘన. దిశ ఘటనపై ఆమె తెరకెక్కించనున్న చిత్రం గురించి త్వరలో అధికారక ప్రకటన రానుందట.

Also Read : Mr. Bachchan: రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ నుండి వీడియో గ్లింఫ్స్ విడుదల !

Ayushmann KhurranaDisha IncidentKareena Kapoor
Comments (0)
Add Comment