Kareena Kapoor : క‌ర‌ణ్ కామెంట్స్ క‌రీనా ఝ‌ల‌క్

క‌ర‌ణ్ విత్ కాఫీ షో వైర‌ల్

Kareena Kapoor : బాలీవుడ్ న‌టి క‌రీనా క‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. బుల్లి తెర‌పై క‌ర‌ణ్ విత్ కాఫీ రియాల్టీ షోలో పాల్గొంది ఆలియా భ‌ట్ తో క‌లిసి. ఈ సంద‌ర్బంగా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు క‌ర‌ణ్. ఒక ర‌కంగా ఆమెలో మ‌రింత కోపాన్ని తీసుకు వ‌చ్చేలా చిలిపి ప్ర‌శ్న‌లు వేశాడు.

Kareena Kapoor Comments Viral

కానీ వీట‌న్నింటిని గ‌మ‌నించిన క‌రీనా అంతే స్థాయిలో ఝ‌ల‌క్ ఇచ్చింది. మీకు అమీషా ప‌టేల్ కు మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం కాదా అని ప్ర‌శ్నించాడు క‌ర‌ణ్ జోహార్.

దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది క‌రీనా క‌పూర్(Kareena Kapoor). ఇందులో మీరు ఊహించిన‌ట్టు ఎలాంటి భేదాలు , ఈర్ష్యా ద్వేషాలు త‌మ మ‌ధ్య లేవ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ షోకు సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లకు తాపీగా స‌మాధానాలు ఇచ్చింది క‌రీనా.

గ‌తంలో చేసిన సినిమాలు త‌న‌కు సంతృప్తిని ఇచ్చాయ‌ని తెలిపింది. ఒక ర‌కంగా పాత్ర‌లు తాను కోరుకున్న‌ట్టు వ‌చ్చాయ‌ని, త‌న కుటుంబ జీవితం కూడా హాయిగానే ఉంద‌ని పేర్కొంది న‌టి. ప్ర‌స్తుతం సెకండ్ హాఫ్ లో కూడా తాను సంతోషంగా ఉన్నాన‌ని తెలిపింది.

తాను ఫుల్ ఖుషీ గా ఉన్నాన‌ని, ఇందుకు ప్ర‌ధాన కార‌ణం తాను ఎవ‌రితో గొడ‌వ పెట్టుకోనంటూ పేర్కొన్నారు క‌రీనా క‌పూర్.

Also Read : Shah Rukh Khan : యానిమ‌ల్ మూవీపై ఖాన్ కామెంట్

Comments (0)
Add Comment