Kareena Kapoor: రికార్డులకు వయసుతో సంబంధం లేదంటున్న బాలీవుడ్ బ్యూటీ !

రికార్డులకు వయసుతో సంబంధం లేదంటున్న బాలీవుడ్ బ్యూటీ !

Kareena Kapoor: వయసుతో సంబంధం లేకుండా నేనూ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌లను అందించగలనంటోంది బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయిక కరీనా కపూర్‌. త్వరలో ‘ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌’తో రాబోతున్న ఆమె… పారితోషికం గురించి ఆలోచించకుండా సినిమాల్ని ఎంచుకుంటానని చెప్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా… కథల ఎంపిక గురించి కొన్ని ఆసక్తికర సంగతులను పంచుకుంది.

Kareena Kapoor Comment

‘‘బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల్లో నేను ఒకదాన్ని. కానీ.. రెమ్యునరేషన్‌ ని దృష్టిలో ఉంచుకొని కథల్ని ఎంచుకోను. ఇది నేను ఎప్పటి నుంచో పాటిస్తున్న నియమం. సినిమా ఎలాంటిది..? అందులో నా పాత్ర ప్రాధాన్యత తదితర అంశాల్ని చూసుకుంటాను. ప్రేక్షకులకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూ… సమాజంపై ప్రభావం చూపించేలా ఆ సినిమా ఉంటే… కచ్చితంగా తక్కువ రెమ్యునరేషన్‌ కి అయినా నటించడానికి అంగీకరీస్తానని ఆమె అన్నారు. ‘‘ప్రస్తుతం చిత్రపరిశ్రమలో అగ్రకథానాయకులతో సరిసమానంగా హీరోయిన్లు ముందుకు సాగుతున్నారు. వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న హీరోలు చాలా మంది ఉన్నారు. కానీ.. చిత్రపరిశ్రమలో నాయికలకు ఓ వయసు వచ్చాక సెకండ్‌ ఇన్నింగ్స్‌ అంటూ పేర్లు పెడుతున్నారు. దాదాపు 44ఏళ్ల వయసులో ఉన్న నేను కూడా రికార్డు బద్దలు కొట్టగలను’’ అని స్పష్టం చేసింది.

Also Read : Ananya Panday: ఒకవైపు హార్దిక్‌ తో డేటింగ్ రూమర్స్, మరోవైపు ఖరీదైన కారు కొన్న బాలీవుడ్ బ్యూటీ !

Kareena KapoorSaif Ali KhanThe Buckingham Murders
Comments (0)
Add Comment