Kareena Kapoor :యూనిసెఫ్‌ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా కరీనా కపూర్ !

యూనిసెఫ్‌ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా కరీనా కపూర్ !

Kareena Kapoor:ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్‌ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్‌ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు యూనిసెఫ్‌ ఇండియా జాతీయ అంబాసిడర్‌గా ఎంపికైన ఆమెతో కలిసి పిల్లల హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము’’ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

Kareena Kapoor:-

ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ..‘‘పిల్లల హక్కులు, భవిష్యత్తు తరం ముఖ్యంగా విద్య, లింగ సమానత్వం లాంటి తదితర ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. బలహీన వర్గాలకు చెందిన పిల్లల హక్కులను రక్షించడం, వారికి గొప్ప భవిష్యత్తును అందించడం కోసం నా వంతు కృషి చేస్తాను’’ని వ్యాఖ్యల్ని జోడించింది. 2014 నుంచి ఈ సంస్థతో అనుబంధం ఉన్న కరీనా.. ఇంతకు ముందు యూనిసెఫ్‌కు సెలబ్రెటీ అడ్వకెట్‌గా పనిచేశారు.

Also Read :-Ilaiyaraaja: రజనీకాంత్ సినిమా నిర్మాతలకు ఇళయరాజా నోటీసులు !

Kareena Kapoorunicef
Comments (0)
Add Comment