Karan Johar : సెలబ్రిటీ రివ్యూలపై, మూవీ కలెక్షన్స్ కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌లో ప్రతిభ ఆధారంగా అవకాశాలు ఇస్తారా? అని ప్రశ్నించగా....

Karan Johar : బాలీవుడ్‌ నిర్మాత, ధర్మా ప్రొడక్షన్‌ అధినేత కరణ్‌ జోహార్‌ గురించి పరిచయం అక్కర్లేదు. భారీ నిర్మించడమే కాకుండ ఇతర భాషా చిత్రాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ద్వారా హిందీలో విడుదల చేస్తుంటారు. సినిమాలకు సంబంధించిన టాక్‌, కలెక్షన్లను సోషల్‌ మీడియా వేదికగా చెబుతుంటారు. తాజాగా ఆయన సెలబ్రిటీ రివ్యూలు, బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కరణ్‌ జోహార్‌(Karan Johar). ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో పరిస్థితులపై స్పందించారు.

Karan Johar Comment

బాలీవుడ్‌లో ప్రతిభ ఆధారంగా అవకాశాలు ఇస్తారా? అని ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ లేదని కరణ్‌ జవాబిచ్చారు. కొన్ని సందర్భాల్లో టాలెంట్‌ కంటే బాక్సాఫీస్‌ సక్సెస్‌, పాపులారిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారని చెప్పారు. ప్రతిభ ఉన్న కొంతమందికి సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన చెప్పారు. అంతే కాదు బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌పై మాట్లాడుతూ.. అవన్నీ ఫేక్‌ అని క్లారిటీ ఇచ్చారు. సెలబ్రిటీ రివ్యూల్లోనూ నిజాలు ఉండవని చెప్పారు. ‘ మేమంతా అబద్థాలు చెబుతాం’ అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆలియాభట్‌ కీలక పాత్రలో వాసన్‌ బాల దర్శకత్వం వహించిన ‘జిగ్రా’ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా, ‘జిగ్రా’ టీమ్‌ ఫేక్‌ కలెక్షన్స్‌తో ప్రేక్షకులను మోసం చేస్తుందంటూ ‘సవి’ నటి దివ్యాఖోసా సోషల్‌ మీడియా వేదికగా కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో కరణ్‌ జోహార్‌ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

Also Read : War 2 Movie : ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు పాన్ ఇండియా స్టార్ హీరోలు

BreakingCommentsKaran JoharViral
Comments (0)
Add Comment