Karan Johar : బాలీవుడ్ లో నెపోటిజం పై భగ్గుమన్న కరణ్ జోహార్

ఫ్యాన్స్ కరణ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు...

Karan Johar : బాలీవుడ్‌లో మరోసారి నెపోటిజం సెగలు ఉవ్వెతున్న ఎగుస్తున్నాయి. అలియా భట్ లేటెస్ట్ ఫిల్మ్ జిగ్రా ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ వాసన్ బాల చేసిన కొన్ని కామెంట్స్ నెటిజన్లలో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీశాయి. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఆన్‌కండిషినల్‌గా అలియాకు సహాయం చేస్తున్నాడంటూ నెటిజెన్స్ కరణ్‌(Karan Johar)పై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో కరణ్ కూడా సీరియస్ పోస్ట్‌తో సోషల్ మీడియాపై విరుచుకుపడ్డారు. ఇంతకీ ఏమైందంటే..

Karan Johar Slams..

అలియా భట్ లేటెస్ట్ ఫిల్మ్ జిగ్రా మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవునున్న వేళా సినీ యూనిట్ ప్రమోషన్స్ స్పీ‌డా‌ప్ చేసింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు వాసన్ బాల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చినా వీడియో వైరల్ అవుతోంది. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన కన్సెన్ట్ లేకుండానే అలియాకి స్క్రిప్ట్ సెండ్ చేశాడని అసహనం వ్యక్తం చేశాడు. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ కరణ్(Karan Johar) తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో వీటిపై రెస్పాండ్ అయిన కరణ్(Karan Johar) సీరియస్ అయ్యారు. క్లిక్‌బెట్ వీడియోలు చూసి ఆత్రం ఆపుకోకుండా రెచ్చిపోవాల్సిన అవసరం లేదన్నారు. మొదటగా పూర్తి వీడియో చూసి మాట్లాడాలని కోరారు. నేను బాల పంపించిన స్క్రిప్ట్‌లో గ్రామర్ మిస్టేక్స్, హీరో ఇంట్రో సీన్లు సరిగ్గా డెవలప్ అవ్వకముందే సెండ్ చేశా, దీంత బాల స్పోర్టివ్ గానే తనపై ఫన్నీ గా రియాక్టయ్యారని క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ పేరు ఎప్పుడైతే ‘X’గా మారిందో అప్పుడే సోషల్ మీడియా నా ఎక్స్ గా మారిందన్నారు. దీనికి దర్శకుడు వాసన్ బాల కూడా లవ్యూ కరణ్ అంటూ రిప్లై ఇచ్చారు.

ఈ సినిమాకి ఇండిపెండెంట్ సినిమాలలో తన మార్క్ రైటింగ్, డైరెక్షన్‌తో సంచలనం సృష్టించిన కథ రచయిత, దర్శకుడు వాసన్ బాల దర్శకత్వం వహించగా, ఆలియా భట్, వేదంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోగా.. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా బాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉంది. విదేశాల్లో ఓ కేసులో చిక్కుకున్న తన సోదరుడి కోసం ఎంతకైనా తెగించే సత్య అనే అమ్మాయి క్యారెక్టర్లో ఆలియా ఇంటెన్సివ్‌గా కనిపిస్తుంది. ఇక తమ్ముడి క్యారెక్టర్లో జోయా అక్తర్ నెట్‌ఫ్లిక్స్ మూవీ ‘ఆర్చీస్’ ఫేమ్ వేదంగ్ రైనా‌కి ఇది రెండో పెద్ద మూవీ కావడం విశేషం. కాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం విశేషం. అయితే ఈ మూవీ ఆడియెన్స్‌ని ఎలా మెప్పించనుందో తెలుసుకోవాలంటే మాత్రం వచ్చే నెల 11వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

Also Read : Aditi Rao Hydari : సిద్ధార్థ్ అదితిని ఆ ఫుడ్ పెట్టి ప్రేమలో పడేసాడ..!

CommentsKaran JoharSlamsViral
Comments (0)
Add Comment