Popular Actress Aishwarya Rejects :క‌ర‌ణ్ జోహార్ ఆఫ‌ర్ ఐశ్వ‌ర్య డోంట్ కేర్

చివ‌రి సారిగా పొన్నియ‌న్ సెల్వ‌న్ -2లో

Aishwarya : హిందీ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టి ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్(Aishwarya). త‌న సినీ కెరీర్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను కోల్పోయింది. ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా చెప్పింది. ఆ మ‌ధ్య‌న చిట్ చాట్ సంద‌ర్బంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. క‌ర‌ణ్ జోహార్ మూవీని ఐష్ తిర‌స్క‌రించారు. ఎదురు దెబ్బ‌ల నుండి ర‌క్షించుకునేందుకు గాను తాను చివ‌రి సారిగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తీసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ -2లో క‌నిపించారు. ఆ త‌ర్వాత నుంచి నేటి దాకా ఎలాంటి అప్ డేట్స్ లేవు మూవీస్ గురించి.

Aishwarya Rejects Karan Johar Offers

ఇక ఐశ్వ‌ర్య రాయ్ మూవీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 20 ఏళ్ల‌కు పైగా అవుతుతుంది. తొలుత త‌మిళ సినిమాలో న‌టించింది. త‌న‌కు న‌చ్చితేనే మూవీస్ కు ఓకే చెప్పింది త‌ప్పా వేరే వాటిని ఒప్పుకోలేదు. త‌న క‌ళాత్మ‌క దృష్టికి స‌రిపోని అనేక భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను వ‌దులుకుంది. వాటిలో కొన్ని భారీ స‌క్సెస్ సాధించ‌గా మ‌రికొన్ని ఆశించినంత‌గా ఆడ‌లేదు. వాటిలో ఒక‌టి క‌ర‌ణ్ జోమార్ కుచ్ కుచ్ హోతా హై. ఇది బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

ఈ మూవీలో రాణీ ముఖ‌ర్జీ పాత్ర టీనా మ‌ల్హాత్రా పోషించింది. దీనిని ముందుగా ఐష్ కు ఆఫ‌ర్ చేశారు క‌ర‌ణ్ జోహార్. షారుక్ ఖాన్ తొలి ప్రేయ‌సిగా న‌టించారు. విమ‌ర్శ‌ల‌కు, ఫ్యాన్స్ త‌న గురించి ఒప్పుకోర‌నే ఉద్దేశంతో ఐశ్వ‌ర్య రాయ్ వ‌దులుకున్న‌ట్లు చెప్పింది. ఒక‌వేళ ఆనాడు ఆ పాత్ర చేసి ఉంటే త‌న‌ను ప్రతి ఒక్క‌రూ టార్గెట్ చేసి ఉండేవార‌ని అభిప్రాయ ప‌డింది.

Also Read : Court Movie Sensational : భారీ ధ‌ర‌కు ‘కోర్ట్’ నెట్ ఫ్లిక్స్ కైవ‌సం

Aishwarya RaiKaran JoharShockingUpdatesViral
Comments (0)
Add Comment