Kannappa: 30 మిలియన్స్‌ వ్యూస్‌ తో దూసుకుపోతున్న కన్నప్ప టీజర్ !

30 మిలియన్స్‌ వ్యూస్‌ తో దూసుకుపోతున్న కన్నప్ప టీజర్ !

Kannappa: నటుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో, మంచు కుటుంబం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోతోన్న సినిమా ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా.మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్‌కుమార్‌, మోహన్ బాబు, మోహన్‌లాల్, శరత్ కుమార్, శివరాజ్‌కుమార్‌ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను ఇటీవల జూన్ 14న విడుదల చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌ కూడా గ్రాండ్‌ గా నిర్వహించారు. ఇప్పుడు ఈ టీజర్ మంచు ఫ్యామిలీ సినిమాల రికార్డులను తిరగరాస్తుంది.

Kannappa..

కన్నప్ప(Kannappa) టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని అలరించింది. యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. కన్నప్ప టీజర్ ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ భాషల్లో కూడా విడుదల చేశారు. యూట్యూబ్ లో 30 మిలియన్లలకు పైగా వ్యూస్ సాధించి నలభై మిలియన్ల వ్యూస్ వైపు దూసుకుపోతుంది. కేవలం తెలుగులోనే 20 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించి దూసుకుపోతుంది. దీనితో కన్నప్ప సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Salman Khan: సల్మాన్ ఖాన్ పెళ్ళిపై తండ్రి సలీమ్‌ఖాన్‌ ఆశక్తికరమైన వ్యాఖ్యలు !

KannappaManchu Mohan BabuManchu Vishnu
Comments (0)
Add Comment