Hero Manchu Vishnu-Kannappa :మంచు విష్ణు క‌న్న‌ప్ప రిలీజ్ డేట్ ఫిక్స్

జూన్ 25న ముహూర్తం ఖ‌రారు

Kannappa : ఉత్కంఠ‌కు తెర దించారు మంచు మోహ‌న్ బాబు. తాను నిర్మించిన క‌న్న‌ప్ప(Kannappa) చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినీ రంగానికి చెందిన దిగ్గ‌జ న‌టులు ఇందులో కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ప్ర‌త్యేకించి ఇందులో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ పోషిస్తున్నాడు పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్ర‌భాస్. త‌న‌తో పాటు అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన న‌టుడు అక్ష‌య్ కుమార్, కాజ‌ల్ అగ‌ర్వాల్ , మ‌ల‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ , ర‌ఘు బాబు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Manchu Vishnu -Kannappa Movie Updates

మూవీ మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టారు. తాజాగా మూవీ టీం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను క‌లుసుకుంది. ఈ సంద‌ర్బంగా సీఎం మోహ‌న్ బాబు, టీంను ప్ర‌త్యేకంగా అభినందించారు. క‌న్న‌ప్ప గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక భావ‌జాలం వ్యాప్తి జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న‌కు గిఫ్టును బ‌హూక‌రించారు. యోగిని క‌లిసిన వారిలో విష్ణు, ప్ర‌భు దేవా, నిర్మాత విన‌య్ మ‌హేశ్వ‌రి ఉన్నారు.

ఈ చిత్రం త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని ఆకాంక్షించారు సీఎం. కన్నప్ప భారతదేశం అంతటా ప్రేక్షకులతో ప్రతిధ్వనిస్తుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్బంగా యోగి ఆదిత్యానాథ్ క‌న్న‌ప్ప సినిమా అధికారిక విడుద‌ల తేదీ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించారు. ఈ మేర‌కు జూన్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా చిత్రం రిలీజ్ కానుంది.

Also Read : Ram Gopal Varma Case Shocking :రామ్ గోపాల్ వర్మపై మరో ఫిర్యాదు

CinemaKannappaManchu VishnuReleaseUpdatesViral
Comments (0)
Add Comment