Kannappa : మంచు విష్ణు, డార్లింగ్ ప్రభాస్ , మోహన్ లాల్, మోహన్ బాబు కీలక పాత్రలలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఇందులో రుద్ర పాత్రలో కీ రోల్ పోషిస్తున్నాడు పాన్ ఇండియా హీరో. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ , సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. తాజాగా కన్నప్ప(Kannappa) చిత్రం నుంచి లవ్ సాంగ్ విడుదల చేశారు మూవీ మేకర్స్.
Kannappa Love Song Getting Huge Responce
ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. బెంగళూరు వేదికగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ సమక్షంలో పోస్టర్ ను రిలీజ్ చేశారు . ఇదిలా ఉండగా మంచు విష్ణు సినీ కెరీర్ లోనే బిగ్ మూవీగా నిలిచి పోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు మంచు మోహన్ బాబు.
1970లో భక్త కన్నప్ప పేరుతో మూవీ నిర్మించారు. ఆ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. ఇందులో దివంగత కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అందివచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకుని కన్నప్ప ను తీస్తున్నారు. ఇందులో విష్ణుతో పాటు ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటించింది. కన్నప్ప మూవీని ముఖేష్ కుమార్ సింగ్ తీస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ , అక్షయ్ కుమార్ , మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ , శరత్ కుమార్, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ లో ప్రపంచ వ్యాప్తంగా కన్నప్పను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మూవీ మేకర్స్. తాజాగా విడుదల చేశారు లవ్ సాంగ్ ను.
Also Read : మహారాణి కోసం సిద్దమయ్యా