Kannappa: కన్నప్పలో కోసం హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌

కన్నప్ప కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోహీరోయిన్లు, స్టంట్ మాస్టర్లు

Kannappa : మంచు కుటుంబం అతి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ కీచా ఖామ్‌ఫక్డీ రంగంలోనికి దించారు నిర్మాత మోహన్ బాబు. ఇప్పటికే ఇండస్ట్రీకు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ ప్రభాస్, నయనతార, మోహన్ లాన్, శివరాజ్ కుమార్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ను హైర్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌ లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్ శివుడిగా, నయనతార పార్వతిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా మొదట నుపుర్‌ సనన్‌ను ఎంపిక చేసినప్పటికీ డేట్స్‌ సర్దుబాటులో సమస్యలు తలెత్తడంతే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలిగారు.

Kannappa – శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘కన్నప్ప’

‘కన్నప్ప(Kannappa)’ సినిమా మొత్తం ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసే విధంగా నిర్మాత మోహన్ బాబు ఏర్పాట్లు చేసారు. దీనికోసం న్యూజిలాండ్‌లో
సుమారు 800 మంది సిబ్బందితో 5 నెలల పాటు ఆర్ట్ వర్క్ ను సిద్ధం చేసారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌లో ఇటీవల హీరో మంచు విష్ణు గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై మోహన్‌బాబు ట్వీట్‌ చేస్తూ విష్ణు కోలుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే షూటింగ్‌లో జాయిన్‌ అవుతారన్నారు.

Also Read : Indian 2 Movie Teaser : ఇండియ‌న్ 2 టీజ‌ర్ సూప‌ర్

Comments (0)
Add Comment