Allu Arjun-Upendra : జైలు నుంచి రిలీజైన బన్నీని పరామర్శించేందుకు వచ్చిన కన్నడ స్టార్

కన్నడ సూపర్ స్టార్, తనతో కలిసి నటించిన అల్లు అర్జున్‌‌ను అరెస్ట్ చేశారని తెలియగానే....

Upendra : జైలు నుండి విడుదలైన అల్లు అర్జున్‌ని పరామర్శించేందుకు కన్నడ సూపర్ స్టార్ ఆయన ఇంటికి వచ్చారు. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరని అనుకుంటున్నారా? అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌తో శనివారం ఉదయం విడుదలై.. ముందు గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లో చేరుకుని.. అక్కడి నుండి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వచ్చారు. ఆయన ఇంటికి వచ్చినప్పటి నుండి.. టాలీవుడ్ సినీ ప్రముఖులెందరో అల్లు అర్జున్‌ని పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు క్యూ కట్టారు.

Allu Arjun-Upendra Meet

కన్నడ సూపర్ స్టార్, తనతో కలిసి నటించిన అల్లు అర్జున్‌‌ను అరెస్ట్ చేశారని తెలియగానే.. తన సినిమా ‘యూఐ ది మూవీ’ ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఉపేంద్ర(Upendra), ప్రమోషన్ ముగించుకుని వెంటనే అల్లు అర్జున్ ఇంటికి వచ్చారు. ఉపేంద్ర వస్తున్నారని తెలిసి.. అల్లు అర్జున్ ఇంటి నుండి బయటకు వచ్చి మరీ ఆయనను రిసీవ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

ఇక ఉదయం నుండి బన్నీ ఇంటికి సెలబ్రిటీలు వస్తూనే ఉన్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి సతీమణి సురేఖ, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, కె. రాఘవేంద్రరావు, సురేష్ బాబు, శ్రీకాంత్, విజయ్ దేవరకొండ సోదరులు, ఆర్. నారాయణమూర్తి, దర్శకుడు సుకుమార్, బివిఎస్‌ఎన్ ప్రసాద్, హరీష్ శంకర్, బివిఎస్ రవి, సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ, పుష్ప నిర్మాతలు నవీన్ మరియు రవిశంకర్, కొరటాల శివ, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, ఇప్పుడు ఉపేంద్ర వంటి వారంతా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. తనకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన సినీ ప్రముఖులందరూ అల్లు అర్జున్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని.. ప్రస్తుత పరిస్థితిపై చర్చిస్తున్నారు.

Also Read : Allu Arjun Release : ఈరోజు ఉదయం జైలు నుంచి విడుదలైన పుష్ప రాజ్

allu arjunMeetUpdatesUpendraViral
Comments (0)
Add Comment