Shiva Rajkumar : అనారోగ్యంతో బాధపడుతున్న కన్నడ స్టార్ ‘శివ రాజ్ కుమార్’

ఓఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్నట్లు పేర్కొన్నాడు...

Shiva Rajkumar : కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లానని సమాచారం. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శివరాజ్ కుమార్(Shiva Rajkumar) మాట్లాడుతూ.. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు. నటుడు శివరాజ్‌కుమార్‌ వయసు 60 ఏళ్లు దాటింది. ఆయన ఇప్పటికీ చాలా ఫిట్‌గా ఉంటారు. రెగ్యులర్ షూటింగ్‌లో పాల్గొంటుంది. ప్రస్తుతం ‘భైరతి రంగల్’ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు శివరాజ్ కుమార్. ఇప్పుడు ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టాడు. ఆయన తాను అనారోగ్యంతో ఉన్నానని, శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లానని చెప్పారు.

Shiva Rajkumar Health Updates

ఓఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్నట్లు పేర్కొన్నాడు. ‘నేను అనారోగ్యంతో ఉన్నాను. నేను అబద్ధం చెప్పను. నేను కూడా మనిషినే. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను’ అని తెలిపారు శివరాజ్ కుమార్. చికిత్స కోసం నాలుగు సెషన్లు ఉన్నాయి. ఇప్పటికే రెండు సెషన్లు పూర్తయ్యాయి. మరో రెండు సెషన్లు జరగాల్సి ఉంది. శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. అమెరికాలో చేయించుకోవాలా.. లేక ఇక్కడ చేయించుకోవాలా.. అని ఆలోచిస్తున్నా. అమెరికాలో చేస్తే నెల రోజులు అక్కడికి వెళ్లాలి అని తెలిపారు.

అలాగేజనవరి వరకు తాను రెస్ట్ తీసుకుంటున్నట్టు కూడా తెలిపారు. ఈ విషయాన్ని శివరాజ్‌కుమార్ తన నిర్మాతలకు తెలియజేశారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని ఇలా చేశారన్నారు. కానీ అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటాను అని అన్నారు.. అభిమానులు ఫొటోలు తీసుకోవాలనుకున్నప్పుడు కాస్త దూరంగా ఉండమని చెబుతాను. వారికి ఇన్‌ఫెక్షన్ రాకూడదని ఇలా చేశాను. ఇదంతా ఇంకో రెండు నెలలు’అన్నారు శివన్న. అయితే శివరాజ్‌కుమార్ ఎలాంటి అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్నారో వెల్లడించలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. శివన్న త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన నటించిన ‘భైరతి రంగల్’ చిత్త నవంబర్ 15న విడుదల కానుంది.

Also Read : Shah Rukh Khan : బాలీవుడ్ బాద్ షా ‘షారుఖ్ ఖాన్’ కి బెదిరింపులు కాల్స్

Health ProblemsShiva RajkumarUpdatesViral
Comments (0)
Add Comment