Shakhahaari : తాజాగా తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న కన్నడ మర్డర్ మిస్టరీ చిత్రం శాఖాహారి(Shakhahaari) ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే కన్నడ నుంచి వచ్చిన బ్లింక్ చిత్రం మన తెలుగు వారికి సరికొత్త అనుభూతిని ఇవ్వడంతో పాటు అదిరిపోయే థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తోంది. ఈ సినిమాను చూశాకా మెచ్చుకున్న వారే గానీ తెగిడిన వారు ఒక్కరూ కూడా లేకపోవడం గమనార్హం. అంతలా ఈ మూవీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతోంది. సందీప్ సుంకడ్ ఈ సినిమాతో దర్శక, రచయితగా ఎంట్రీ ఇవ్వగా రంగాయణ రఘు, గోపీకృష్ణ దేశ్‌పాండే కీలక పాత్రల్లో నటించారు.
Shakhahaari OTT Updates
కథ విషయానికి వస్తే.. కర్ణాటకలోని ఓ పల్లెటూరు నేపథ్యంలో మూడు, నాలుగు పాత్రల చుట్టే సినిమా సాగుతుంది. సుబ్బన్న అనే మధ్య వయస్కుడు ఒంటరిగా ఓ చిన్న పాటి హోటల్ నిర్వహించుకుంటూ ఊరి వారందరితో కలుపుగోలుగా ఉంటూ తోచిన వారికి సాయం చేస్తూ కాలం వెళ్లదీస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఓ రోజు ఓ హత్య కేసు నిందితుడు విజయ్ జైలు నుంచి తప్పించుకుని బుల్లెట్ గాయంతో ఆ హోటల్‌కు వస్తాడు. సుబ్బన్న అతని కథ విని బయట ఎవరికీ తెలియకుండా రక్షిస్తాడు. కొద్ది రోజుల తర్వాత విజయ్‌ను అక్కడి నుంచి వేరే ఊరికి పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తాడు. ఈ క్రమంలోనే తెల్లారితే ఊరెళ్లాల్సిన విజయ్ చనిపోయి కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో సుబ్బన్న ఏం చేశాడు, విజయ్ ఎలా చనిపోయాడు. విజయ్ హత్యానేరంలో ఎలా ఇరుక్కున్నాడు. విజయ్ భార్యను ఎవరు చంపారు, సుబ్బన్న తమ్ముడిని ఎవరు చంపారు, విజయ్ బాడీ దొరికిందా, ఈ కేసును ఎస్సై చేధించగలిగాడా, సుబ్బన్నకు ఏమైందనే ఇంట్రెస్టింగ్ కథకథనాలతో సినిమా ఆకట్టుకుంటుంది.
ఆరంభం నుంచి ఫ్రీ క్లైమాక్స్ వరకు చాలా సింపుల్‌గా నడిచిన సినిమా క్లైమాక్స్‌కు వచ్చేసరికి ప్రేక్షకుల మైండ్‌ను బ్లాక్ చేస్తుంది. చివరలో వచ్చిన ట్విస్టు సాధారణ సినీ ప్రేక్షకుడిని సైతం కొన్ని రోజుల వరకు హంట్ చేస్తుండనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ఎండింగ్ సూపర్‌గా కుదిరింది. జూన్‌లోనే ఓటీటీలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ శాఖాహారి(Shakhahaari) చిత్రం ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్, థ్రిల్లర్ లవర్స్ ఈ వీకెండ్ ఈ సినిమాను ఎట్టి పరిస్తితుల్లోనూ మిస్ చేయకండి.
Also Read : Mani Sharma : ‘డబుల్ ఇస్మార్ట్’ పాటలపై వస్తున్న విమర్శలకు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్