UI Movie : ఉపేంద్ర ‘యూఐ’ సినిమా పై కన్నడ హీరోల ప్రశంసలు

కన్నడ హీరో యశ్‌ ఈ సినిమాను చూడడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు...

UI Movie : ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యూఐ’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్నా.. ఇప్పుడు పాజిటవ్‌గా ముందుకు నడుస్తోంది. తాజాగా ఈ సినిమాపై యంగ్‌ హీరోలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కన్నడ హీరో యశ్‌ ఈ సినిమాను చూడడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.ఉపేంద్ర(Upendra)తో కలిసి ఈ చిత్రాన్ని చూసిన యశ్‌ ఆయన్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు.

UI Movie Updates

“ఈసినిమా కోసం ఉపేంద్ర సర్‌ నన్ను ఆహ్వానించడం నా అదృష్టం, నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన ఎంచుకునే కథలు ఎంతో విలక్షణంగా ఉంటాయని మరోసారి రుజువు చేశారు. నాతోపాటు ఎంతోమంది నటులు ఇండస్ట్రీ కి రావడానికి ఆయన స్ఫూర్తినిచ్చారు. యూఐ చిత్రం ప్రేక్షకులను లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ఆయన కేవలం వినోదం కోసమే సినిమాలు తీయరు. అనేక సమస్యల గురించి తన సినిమాలో మాట్లాడతారు. ఇందులో విజువల్స్‌ బాగున్నాయి. దీనికోసం పనిచేసిన నటీనటులతోపాటు సాంకేతిక నిపుణులకు అభినందనలు తెలుపుతున్నా” అని అన్నారు. యుఐ సినిమాపై కిచ్చా సుధీప్‌ కూడా తన అభిప్రాయాం తెలిపారు. ఎక్స్‌ వేదికగా మాట్లాడారు ‘‘ఇంత గొప్ప ఆలోచనను ముందుకుతీసుకువెళ్లిన చిత్రబృందానికి అభినందనలు. దీనికి వస్తోన్న ప్రేక్షకాదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. టీమ్‌కు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంపై మూడుసార్లుగ్రామీ అవార్డు తీసుకున్న సంగీత దర్శకుడు రికీ కేజ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఇది అద్భుతమైన చిత్రమని ఇలాంటివి మంచి విజయాన్ని సాధించాలని కోరారు. సరదాగా అలరిస్తూనే ఆలోచింపజేస్తుందని చెప్పారు.

Also Read : Kareena Kapoor : బాలీవుడ్ నటిపై పాక్ నటుడు కీలక వ్యాఖ్యలు

CinemaTrendingUI The MovieUpdatesUpendraViral
Comments (0)
Add Comment