Kanguva: దసరాకి సూర్య ‘కంగువ’ !

దసరాకి సూర్య 'కంగువ' !

Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా ‘కంగువా(Kanguva)’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వేదాళం, వివేగం, విశ్వాసం, అన్నాత్తే వంటి సూపర్ హిట్  సినిమాల డైరెక్టర్ శివ (సిరుతై శివ) దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దిశా పఠానీ హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో, జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. సైంటిఫిక్‌ అండ్‌ టైమ్‌ ట్రావెల్‌ మూవీ ‘కంగువ’ సినిమాను… ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నిర్మాతలు కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ను త్రీడీలోనూ రూపొందించారు.

Kanguva Movie Updtes

ఈ సినిమాకు సంబంధించి కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన టీజర్‌… పాన్‌ ఇండియా రేంజ్‌ లో ప్రేక్షకులందరినీ మెప్పించి… అంచనాలను మరింత పెంచేసింది. దీనితో ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం చిత్రం యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. ‘కంగువ’ సినిమాను ఈ  ఏడాది అక్టోబరు 10న విడుదల చేస్తున్నట్లుగా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు సూర్య. రిలీజ్‌ డేట్‌ని బట్టి ‘కంగువ’ దసరా పండగ సందర్భంగా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇక ‘కంగువ’ సినిమా డిఫరెంట్‌ టైమ్‌లైన్స్ లో ఉంటుందని, సూర్య ఐదారు గెటప్స్‌లో కనిపిస్తారని, ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Naga Shaurya: రిమాండ్ ఖైదీ దర్శన్ కు సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో నాగశౌర్య !

KanguvaSivaSuriya
Comments (0)
Add Comment