Kanguva Movie : తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ నటులలో ఒకడు సూర్య. తను తాజాగా నటిస్తున్న చిత్రం కంగువ. ఇందులో కీలకమైన పాత్రలలో సూర్యతో పాటు దిశా పటానీ కూడా నటిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Kanguva Movie Updates
ఇప్పటికే తమిళ్ మూవీ నుంచి వస్తున్న చిత్రాలు వరుసగా కోట్లు కురిపిస్తున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ తీసిన జైలర్ రికార్డ్ క్రియేట్ చేసింది. లోకేష్ కనగరాజ్ తీసిన లియో దుమ్ము రేపింది. తాజాగా పా రంజిత్ విక్రమ్ తో తీసిన తంగలాన్ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఇదిలా ఉండగా సూర్య కెరీర్ లో వస్తున్న కంగువ చిత్రం 42వది కావడం విశేషం. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ నటిని కావాలని తీసుకున్నాడు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కంగువను(Kanguva) తెరకెక్కించే ప్రయత్నం చేశాడు.
కంగువకు సంబంధించి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. మొత్తంగా కంగువ ఫ్యాన్స్ ను కాటు వేసేలా ఉందంటున్నారు ఫ్యాన్స్. దీనిని చారిత్రిక నేపథ్యం కలిగి ఉన్న సినిమాగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సూర్య ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read : Kasthuri Shankar : కస్తూరి బోల్డ్ కామెంట్స్