Kanguva Movie : అంద‌రి చూపు కంగువ వైపు

శ‌ర వేగంగా చిత్రం షూటింగ్

Kanguva Movie : అంద‌రి చూపు సూర్య న‌టిస్తున్న కంగువ వైపు ఉంటోంది. శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆది నారాయ‌ణ క‌థ రాశారు. మధ‌న్ కార్కీ డైలాగులు రాశారు. సూర్య‌తో పాటు దిశా ప‌టానీ, బాబీ డియోల్ కంగువ‌లో(Kanguva Movie) న‌టించారు. వెట్రి ప‌ళ‌ని సామి ఛాయా గ్ర‌హ‌ణం అందిస్తే దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ , యువి క్రియేష‌న్స్ దీనిని కంగువ‌ను విడుద‌ల చేయ‌నుంది.

Kanguva Movie Viral

భారీ బ‌డ్జెట్ తో కంగువ‌ను తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు శివ‌. తొలుత రూ. 300 కోట్లు అంచ‌నా వేశారు. కానీ అంచ‌నాల‌కు మించి రూ. 350 కోట్ల‌కు పైగా అయ్యింద‌ని సినీ వ‌ర్గాల‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కంగువ‌కు ట్రాన్సెల్ మ్యాన్ విత్ ది ప‌వ‌ర్ ఆఫ్ ఫైర్స్ అని ట్యాగ్ లైన్ కూడా ద‌ర్శ‌కుడు చేర్చాడు.

ఈ చిత్రాన్ని కేఈ జ్ఞాన వేల్ రాజా, వి. వంశీ కృష్ణా రెడ్డి , ప్ర‌మోద్ ఉప్ప‌ల పాటి నిర్మించారు. ఈ చిత్రంలో సూర్య ఐదు పాత్ర‌ల‌లో న‌టించారు. న‌ట‌రాజ‌న్ సుబ్ర‌మ‌ణ్యం, యోగి బాబు, రెడిన్ కింగ్సీ, కోవై స‌ర‌ళ‌, ఆనంద్ రాజ్, ర‌వి రాఘ‌వేంద్ర కూడా కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. సూర్య కెరీర్ లో ఇది 42వ చిత్రం. 2021లో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ను ప్రారంభించింది. శ‌ర వేగంగా చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటోంది. 2024 ప్రారంభంలో కంగువ‌ను విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్.

Also Read : Kushi Movie : ఓవ‌ర్సీస్ లో ఖుషీ హ‌వా

Comments (0)
Add Comment