Kanguva Movie : ఎప్పటికప్పుడు అప్డేట్లతో వైరల్ అవుతున్న సూర్య ‘కంగువ’ సినిమా

మొత్తం 10 భాషల్లో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా రూపొందనున్న 'కంగువ'

Kanguva Movie : జాతీయ అవార్డు గ్రహీత, స్టార్ హీరో సూర్య నటిస్తున్న చిత్రం ‘కంగువ’. ప్రముఖ నిర్మాణ సంస్థలైన స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పిరియాడిక్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. దిశా పటాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ‘కంగువ(Kanguva)’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు.

Kanguva Movie

సూర్య డబ్బింగ్ ప్రక్రియను చూపుతున్న ఫోటోను, అలాగే డబ్బింగ్ పనులు జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోలో సూర్య, దర్శకుడు శివ మరియు ఇతర సాంకేతిక నిపుణులతో కలిసి తీసుకున్న ఫోటోను కూడా మేకర్స్ విడుదల చేశారు. . ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం సూర్య అభిమానులే కాకుండా ప్రేక్షకులు అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

మొత్తం 10 భాషల్లో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా రూపొందనున్న ‘కంగువ’ చిత్రానికి ప్రపంచ స్థాయి దర్శకత్వం, సూర్య నటన హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్‌ తెలిపారు. హీరో సూర్య జీవితాన్ని వర్ణించే ఈ భారీ బడ్జెట్ చిత్రం భారతీయ తెరపై ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌ని అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా 3డిలో విడుదల కానుంది.

Also Read : Tripti Dimri : మరో భారీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన యానిమల్ బ్యూటీ త్రిప్తి

KanguvaMovieSuriyaTrendingUpdatesViral
Comments (0)
Add Comment