Kangana Ranaut: కంగనాను సర్ ప్రైజ్ చేసిన తలైవా

కంగనాను సర్ ప్రైజ్ చేసిన తలైవా

కంగనాను సర్ ప్రైజ్ చేసిన తలైవా

Kangana Ranaut : జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షుకులను అలరించడమే కాకుండా, సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. భాతర అత్యున్నత పౌర పురస్కారం పద్మ శ్రీ తో పాటు నాలుగు నేషనల్ అవార్డులు, ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న కంగనా సుమారు ఎనిమిదేళ్ళ తరువాత ఆర్ మాధవన్ తో కలిసి నటించబోతుంది. 2015లో ఆర్ మాధవన్ తో కలిసి ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ లో కలిసి నటించిన బాలీవుడ్ భామ… ప్రస్తుతం విజయ్ దర్శకత్వంలో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అయితే ఈ సినిమా సెట్ కు విచ్చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్… కంగనాను సర్ ప్రైజ్ కు గురిచేసారట.

Kangana Ranaut – కంగనా సినిమా సెట్ లో తలైవా

ఆర్ మాధవన్ తో ఎనిమిదేళ్ళ తరువాత నటించబోతున్న ఈ సినిమా సెట్ లోనికి సూపర్ స్టార్ రజనీకాంత్ విచ్చేసి అటు మాధవన్ తో పాటు ఇటు కంగనాను(Kangana Ranaut) సర్ ప్రైజ్ కు గురిచేసారట. భారతీయ సినిమా దేవుడిగా చెప్పుకునే తలైవా రజనీకాంత్ మా సినిమా సెట్స్ కు రావడం చాలా ఆనందంగా ఉంది… అంటూ కంగనా స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనితో కంగనా-రజనీ కాంబినేషన్ లో సినిమా ఉండబోతుందా అనే చర్చ ప్రారంభమయింది. సమకాలీన రాజకీయాలపై కూడా తనదైన శైలిలో స్పందించే కంగనా రనౌత్ ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో “ఎమర్జెన్సీ” అనే సినిమాను నిర్మిస్తోంది. స్వతంత్ర్య భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తునన ఈ సినిమాలో కంగనా అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.

Also Read : Balakrishna-Dulquer Salman: బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్ ?

Kangana Ranautsuper star
Comments (0)
Add Comment