Kangana Ranaut: డేటింగ్ పుకార్లపై స్పందించిన బాలీవుడ్ క్వీన్ !

డేటింగ్ పుకార్లపై స్పందించిన బాలీవుడ్ క్వీన్ !

Kangana Ranaut: విభిన్న పాత్రలు, విలక్షణమైన నటనతో ప్రేక్షుకులను అలరించడమే కాకుండా, సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన నటి కంగనా రనౌత్. సినిమాలు, అవార్డులు, రాజకీయాలు, సమకాలీస సమస్యలు, వ్యక్తిగత విషయాలు అని తేడా లేకుండా ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో ఉండే కంగనా… ఇటీవల అయోధ్య రామమందిరంలోని బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠలో చేసిన హడావిడీ అంతాఇంతాకాదు. ‘జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌’ అంటూ గొంతు పోయేలా నినాదాలు చేస్తూ… రామచంద్రమూర్తిపై తనకున్న భక్తివిశ్వాసాలను తెలియజేసే ప్రయత్నం చేసింది. అయితే ఈ వేడుకలో కంగనాతోపాటు ‘ఈజ్‌ మై ట్రిప్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్‌ పిట్టి కూడా ఉండటం… వీరిద్దరూ కలిసి అయోధ్య రామమందిరం ఎదురుగా ఫొటోలకు ఫోజులు ఇవ్వడంతోనే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్‌ కావడంతో… నిషాంత్-కంగనా రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది.

Kangana Ranaut Comment

కంగనా-నిషాంత్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను చూసి ఖంగు తిన్న కాంట్రవర్సీ క్వీన్ కంగనా(Kangana Ranaut)… ఆలస్యం చేయకుండా దానిపై వివరణ ఇచ్చారు. ‘దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు. కలిసి ఫొటోలు దిగితే రిలేషన్‌లో ఉన్నట్టేనా ? బుద్ధిలేకుండా ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు ? నిషాంత్‌కి పెళ్లయింది. అతనికి ఓ కుటుంబం ఉంది. అతని వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పటికే ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నాను. అతనెవరో, అతని వివరాలేంటో త్వరలోనే చెబుతాను. మంచి వార్త కోసం వెయిట్‌ చేయండి. ఇలాంటి పిచ్చి వార్తలు రాసి మమ్మల్ని విసిగించకండి’ అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. దీనితో నిషాంత్ తో డేటింగ్ రూమర్లను బాలీవుడ్ క్వీన్ కంగనా కొట్టి పారేసినట్లయింది.

ఇది ఇలా ఉండగా ఇటీవల తన హెయిర్ స్టైలిస్ట్ చేయి పట్టుకుని నడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… అతనితో కంగనా డేటింగ్ లో ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనితో వారు తోబుట్టువులు, సహోద్యోగులు కూడా అయి ఉండొచ్చు. నాతో ఉన్న వ్యక్తి నా హెయిర్‌ స్టైలిష్ట్‌. నేను కొన్ని సంవత్సరాలుగా అతడి ఫ్రెండ్లీ కస్టమర్‌ని’’ అని ఆమె వివరణ ఇచ్చారు. ఇక సినిమాల విషయానికొస్తే స్వీయ దర్శకత్వంలో కంగన(Kangana Ranaut) నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’తో ప్రేక్షకులను అలరించిన కంగన, మాధవన్‌ల కాంబోలో 8 ఏళ్ల తర్వాత రాబోతున్న మరో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కు ఇటీవలే సైన్‌ చేశారు.

Also Read : Tillu Square: వేసవి సెలవులకు వెళ్లిన ‘టిల్లు స్క్వేర్‌’ !

CommentKangana RanautTrendingUpdatesViral
Comments (0)
Add Comment