Kangana Ranaut: డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన కంగనా !

డేటింగ్‌ రూమర్స్‌పై స్పందించిన కంగనా !

Kangana Ranaut: బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ మరోసారి వార్తల్లో కెక్కారు. ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ తనపై వేసిన పరువు నష్టం దావా కేసులో స్టే కోరుతూ కోర్టు మెట్లు ఎక్కిన కంగనా… తాజాగా డేటింగ్ విషయంలో తనపై వస్తున్న రూమర్స్ పై ఘాటుగా స్పందించింది. ముంబైలో ఇటీవల ఆమె ఓ యువకుడి చెయ్యి పట్టుకుని నవ్వుకుంటూ వెళ్తున్న ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీనితో ఆ యువకుడితో… కంగనా డేటింగ్ లో ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేసాయి. ఆ అదృష్టవంతుడు ఎవరు అంటూ కొంతమంది నెటిజన్లు ఏకంగా కంగనానే ప్రశ్నించారు. దీనితో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఫోటోపై సోషల్ మీడియా వేదికగా కంగనా స్పందించింది.

Kangana Ranaut Comments Viral

డేటింగ్ రూమర్స్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన కంగనా రనౌత్… ‘‘సెలూన్‌లో నాతో పాటు ఉన్న మిస్టరీ మ్యాన్‌ ఎవరని అడుగుతున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ నన్ను ట్యాగ్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి క్లోజ్‌గా కనిపిస్తే… వారి మధ్య ప్రేమ ఉందని ఊహించుకుంటారా ? చనువుగా ఉండడానికి ఇతర కారణాలు కూడా ఉంటాయి. వారు తోబుట్టువులు, సహోద్యోగులు కూడా అయి ఉండొచ్చు. నాతో ఉన్న వ్యక్తి నా హెయిర్‌ స్టైలిష్ట్‌. నేను కొన్ని సంవత్సరాలుగా అతడి ఫ్రెండ్లీ కస్టమర్‌ని’’ అని ఆమె తన ఇన్‌ స్టాలో రాసుకొచ్చారు.

దీనితో తనపై వస్తున్న డేటింగ్‌ రూమర్స్‌కు కంగనా(Kangana Ranaut) చెక్‌ పెట్టిట్లైంది. ఇక సినిమాల విషయానికొస్తే స్వీయ దర్శకత్వంలో కంగన నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ‘తను వెడ్స్‌ మను రిటర్న్స్‌’తో ప్రేక్షకులను అలరించిన కంగన, మాధవన్‌ల కాంబోలో 8 ఏళ్ల తర్వాత రాబోతున్న మరో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కు ఇటీవలే సైన్‌ చేశారు.

Also Read : Avantika Vandanapu: హాలీవుడ్‌ లో బిజీగా మారిన టాలీవుడ్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ అవంతిక !

Kangana Ranaut
Comments (0)
Add Comment