Kangana Ranaut: సినిమాల కంటే ఓటీటీలకే సెన్సార్‌ అవసరం – నటి కంగనా రనౌత్‌

సినిమాల కంటే ఓటీటీలకే సెన్సార్‌ అవసరం - నటి కంగనా రనౌత్‌

Kangana Ranaut: వేదిక ఏదైనా నిర్మొహమాటంగా అభిప్రాయాలు పంచుకునే నటీమణుల్లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, ఎంపీ కంగనా రనౌత్‌ ఒకరు. ఇటీవల ఆమె నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన సినిమా ‘ఎమర్జెన్సీ’ సినిమా వివాదాల్లో చిక్కుకుని విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదు చేయడంతో… ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ లో జాప్యం జరిగింది. దీనితో పలుమార్లు ఈ సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది. దీనితో ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవహరిస్తున్న కంగనా… ఈ సినిమా కోసం ముంబయిలో తనకున్న విలువైన బంగ్లాని అమ్మేసిందంటూ వార్తలొచ్చాయి.

Kangana Ranaut Comment

తాజాగా ఈ విషయంపై కంగన(Kangana Ranaut) స్పందించింది… ‘‘నా వ్యక్తిగత ఆస్తిని ఈ సినిమాపై పెట్టాను. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీనితో బంగ్లాని అమ్మక తప్పలేదు’’అని చెప్పింది. ఓ మతం మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ సెన్సార్‌ బోర్డుకి ఫిర్యాదులు రావడంతో సెన్సార్‌ సర్టిఫికెట్‌ రాకపోవడంతో సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే కంగన మాట్లాడుతూ ‘‘సినిమాల కంటే సెన్సార్‌ బోర్డు అవసరం ఓటీటీ వేదికలకే ఎక్కువ ఉంది. డబ్బు చెల్లిస్తే ఎలాంటి కంటెంట్‌కు అయినా యాక్సిస్‌ ఇస్తారు. అందులో పిల్లలు ఏం చూస్తున్నారనేదే భయమేస్తుంది. గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ విషయం పై నేను మాట్లాడాను’ అని కంగన అన్నారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

కంగ‌నా రనౌత్(Kangana Ranaut) నటిస్తున్న తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. స్వతంత్ర్య భారతదేశంలో చీకటిరోజులుగా పిలిచే ఎమెర్జెన్సీ నాటి పరిస్థితులు ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించనుంది. జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. కంగనా స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిలిమ్స్ నిర్మాణంలో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఎమర్జెన్సీ” సినిమా నిర్మాణం, దర్శకత్వం, ఇందిరా గాంధీ పాత్రల బాధ్యతలను తానే స్వయంగా తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సెప్టెంబ‌ర్‌ 6 న ఈ సినిమాను థియేట‌ర్ల‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించినప్పటికీ… సెన్సార్ బోర్డు నుండి అనుమతి రాకపోవడంతో వాయిదా పడింది. తాజాగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ వచ్చినప్పటికీ తదుపరి తేదీ కోసం చిత్ర యూనిట్ కసరత్తు చేస్తుంది.

Also Read : Mammootty and Mohanlal: పదేళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌ లోకి మళయాళ స్టార్ హీరోలు !

emergencyKangana Ranaut
Comments (0)
Add Comment